Tollywood Heroines Qualification: ఎక్కువ చదివిన 9మంది హీరోయిన్లు వీళ్లే.. సమంత అలా సాయి పల్లవి ఇలా!

టాలీవుడ్‌లోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్లు ఎదిగిపోయారు. ఇలా స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తోన్న వారిలో కొందరు మాత్రమే చదువుల్లో బాగా రాణించారు. ఉన్నత విద్యను అభ్యసించినా.. ఉద్యోగాల అవకాశాలు వచ్చినా.. సినిమాల్లోకి వచ్చి సత్తా చాటుతున్నారు. అలాంటి వాళ్ల వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం పదండి!

సాయి పల్లవి అందరి కంటే ఎక్కువ

సాయి పల్లవి అందరి కంటే ఎక్కువ

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సాయి పల్లవి మెడిసిన్ చదివింది. డాక్టర్ అవ్వాలని కలలు కన్న ఈ బ్యూటీ.. ఊహించని విధంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు అందరిలోనూ ఈమెనే ఎక్కువ చదువుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

శ్రేయ ఏమి చదువుకుందో తెలుసా?

శ్రేయ ఏమి చదువుకుందో తెలుసా?

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన శ్రేయ కూడా గ్రాడ్యూయేషన్‌ను పూర్తి చేసుకుంది. ఢిల్లీలోని లేడీ శ్రీరామ కళాశాలలో బీఏ లిటరేచర్ (ఇంగ్లీష్) చేసింది. ఆ తర్వాతనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా తన అందచందాలతో కుర్రాళ్ల మతి పోగొట్టేసింది.

గణితంలో సత్తా చాటిన రకుల్ ప్రీత్

గణితంలో సత్తా చాటిన రకుల్ ప్రీత్

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న రకుల్ ప్రీత్ సింగ్.. చదువులోనూ అదరగొట్టేసింది. చిన్నప్పటి నుంచి గణితంపై పట్టు పెంచుకున్న ఈ బ్యూటీ.. ఆ విభాగంలో గ్రాడ్యూయేషన్‌ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఉన్నత చదువుల వైపు కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయింది.

మధ్యలో ఆపేసిన కాజల్ అగర్వాల్

మధ్యలో ఆపేసిన కాజల్ అగర్వాల్

టాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. చాలా కాలంగా సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తోన్న ఈ బ్యూటీ.. మాస్ మీడియాలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఎంబీయే చదివేందుకు ప్రయత్నించింది. కానీ, మధ్యలోనే చదువుకు పుల్‌స్టాప్ పెట్టేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మాత్రం పుల్‌స్టాప్‌లు లేకుండా దూసుకెళ్తోంది.

సైకాలజీ తెలుసుకోవాలని త్రిష ప్లాన్

సైకాలజీ తెలుసుకోవాలని త్రిష ప్లాన్

తెలుగులోనే కాకుండా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సత్తా చాటుతూ దూసుకుపోతోంది త్రిష. క్రిమినల్ సైకాలజీ చదువుకోవాలని ప్లాన్ చేసుకున్న ఈ బ్యూటీ.. బీబీఏతో పుల్‌స్టాప్ పెట్టేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అనుకున్న చదువును చదవలేకపోయింది.

తమన్నా టీనేజ్‌లోనే రావడం వల్ల

తమన్నా టీనేజ్‌లోనే రావడం వల్ల

టీనేజ్‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా భాటియా. మిల్కీ బ్యూటీగా పేరొందిన ఈ భామ.. ఆరంభం నుంచే వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించడం వల్ల ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ వరకు మాత్రమే చదువుకోగలిగింది. ఆ తర్వాత తీరిక లేక చదువును ఆపేసింది.

సమంత మాత్రం స్పెషల్‌గా చదువు

సమంత మాత్రం స్పెషల్‌గా చదువు

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది సమంత. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకుపోతోన్న ఈ బ్యూటీ.. కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిపోవడం వల్ల చదువుకు పుల్‌స్టాప్ పెట్టేసింది. అదే వ్యాపార లావాదేవీలను సినిమాల్లో ఉంటూనే కొనసాగిస్తోంది.

కంప్యూటర్‌ చదువులో అనుష్క శెట్టి

కంప్యూటర్‌ చదువులో అనుష్క శెట్టి


ఒకప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటి.. చాలా కాలం పాటు టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది స్వీటీ అనుష్క శెట్టి. ఆరంభం నుంచే ఇంటిలిజెంట్ అయిన ఈ బ్యూటీ.. కంప్యూటర్ డిగ్రీని కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి హీరోయిన్‌గా స్థిరపడడంతో చదువును ఆపేయాల్సి వచ్చింది.

Recommended Video

SSMB 28 : అక్కినేని హీరో వైపు చూస్తున్న Trivikram, నో చెప్పే ఛాన్సే లేదు || Filmibeat Telugu
నయనతార ఎంత చదివిందో తెలుసా

నయనతార ఎంత చదివిందో తెలుసా

దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సత్తా చాటుతూ లేడీ సూపర్‌ స్టార్‌గా వెలుగొందుతోంది నయనతార. నటిగా సూపర్ సక్సెస్ అయిన ఈ భామ.. ఆర్ట్స్ డిగ్రీతోనే సరిపెట్టుకుంది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఉన్నత చదువులు చదవలేకపోయింది. కానీ, సినిమాల్లో మాత్రం సూపర్ సక్సెస్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X