ఇదెక్కడి మాస్ రా మామా.. సాయి పల్లవి సారంగదరియా రచ్చ
సాయి పల్లవికి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. చేసిన సినిమాలు తక్కువే అయినా క్రేజ్ మాత్రం చాలా ఎక్కువ. సహజంగా కనిపించడం, సహజంగా నటించడంతో సాయి పల్లవికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. పైగా సాయి పల్లవి యాటిట్యూడ్‌కు అభిమానులు ఫిదా అవుతుంటారు. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా సౌందర్య ఉత్పత్తులకు అంబాసిడర్‌గా వ్యవహరించదు.
అలా సాయి పల్లవి వ్యక్తిత్వానికి ఎంతో మంది అభిమానులున్నారు. ఇక సాయి పల్లవి డ్యాన్సులకు పడి పోని సినీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. అలా సాయి పల్లవి వీడియో సాంగ్స్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంటాయి. యూట్యూబ్‌లో దక్షిణాది మొత్తంలో సాయి పల్లవి సాంగ్స్ మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుంటాయి. రౌడీ బేబీ ఏకంగా బిలియన్ వ్యూస్ కొల్లగొట్టేసింది. ఇప్పటికే సౌత్‌లో రౌడీ బేబీదే రికార్డ్.

ఇక తాజాగా సారంగ దరియా పాట కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. దక్షిణాదిలో అత్యంత వేగంగా యాభై మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన పాటగా సారంగదరియా రికార్డ్ క్రియేట్ చేసింది. రౌడీ బేబీ పాటకు 8 రోజుల్లో 50 మిలియన్ల వ్యూస్ రాగా.. సారంగ దరియాకు 14 రోజుల్లోనే వచ్చేసింది. బుట్టబొమ్మకు 18, వాతి కమింగ్ 21, రాములో రాములకు 27రోజుల సమయం పట్టింది. కానీ సాయి పల్లవి మాస్ ఫాలోయింగ్‌తో కేవలం రెండు వారాల్లోనే ఆ ఫీట్‌ను అందుకుంది.


Click it and Unblock the Notifications











