రూమర్స్ తప్పే.. సారీ చెప్పిన హీరోయిన్ సాయి పల్లవి!
Recommended Video
మలయాళ చిత్రం 'ప్రేమమ్', తెలుగు మూవీ 'ఫిదా' తర్వాత సాయి పల్లవి క్రేజ్ సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమెకు అందం పరంగా, టాలెంట్ పరంగా ఎంత గుర్తింపు వచ్చిందో... అదే స్థాయిలో నెగెటివ్ ప్రచారం కూడా జరిగింది. సాయి పల్లవి పొగరుబోతు అని, తన కోస్టార్లను ఇబ్బంది పెడుతుందనే రూమర్స్ తరచూ వింటూనే ఉన్నాం.
కొందరు స్టార్స్ కూడా సాయి పల్లవి యాటిట్యూడ్ గురించి పరోక్షంగా విమర్శలు చేయడం కూడా ఆమెపై వ్యతిరేక వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఈ క్రమంలో సినీ ప్రేమికుల్లో కూడా సాయి పల్లవిపై అటు ఇటుగా కాస్త నెగెటివ్ ఇంప్రెషనే ఉంది. NGK సినిమా రిలీజ్ నేపథ్యంలో కొందరు ఫ్యాన్స్ ఆమెతో సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే సాయి పల్లవి నుంచి సరైన స్పందన లేక పోవడంతో కొందరు ఆగ్రహానికి గురయ్యారు.
సారీ చెప్పిన సాయి పల్లవి
అయితే తన ఫాలోవర్ల నుంచి నెగెటివ్ కామెంట్స్ రావడం గమనించిన సాయి పల్లవి ఒక మెట్టు కిందకి దిగింది. తాను సరిగా స్పందించనందుకు సారీ చెబుతూ ట్వీట్ చేసింది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొంది.

సాయి పల్లవి గురించి రకుల్ ప్రీత్ సింగ్
NGK సినిమా విషయంలో సైతం సాయి పల్లవిపై ఇటీవల కొన్ని రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. రకుల్ మీద ఆమె డామినేషన్ ప్రదర్శించే ప్రయత్నం చేసిందని, సినిమా మొత్తం తన పాత్ర ఆధిపత్యమే కొనసాగాలనే ఉద్దేశ్యంతో రకుల్ పాత్రకు కోత పెట్టించే ప్రయత్నం చేసిందని టాక్. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, సాయి పల్లవి ఇతరుల పనిలో జోక్యం చేసుకునే వ్యక్తి కాదు, ఆమె చాలా మంచి పిల్ల అనే సర్టిఫికెట్ ఇచ్చింది రకుల్.

సాయి పల్లవిపై అవన్నీ అపోహలు మాత్రమే
సాయి పల్లవిపై ప్రచారంలో ఉన్న నెగెటివ్ రూమర్స్ నిజం కాదని, సెట్స్‌లో ఆమె ప్రవర్తన హుందాగా ఉంటుందని ఆమెతో పని చేసిన దర్శక నిర్మాతలు అంటున్నారు. ఆమెను టార్గెట్ చేస్తూ ఇలాంటి వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో అర్థం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

NGK
సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'ఎన్.జి.కె'. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











