Don't Miss!
- Sports
IND vs NZ: హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే క్యాచ్.. బౌలింగ్ రనప్లోనే..!వీడియో
- News
తిరుమలలో అనూహ్య ఘటనపై విచారణకు ఆదేశించిన టీటీడీ..!!
- Finance
IT Companies: ఐటీలో సత్తా చాటుతున్న భారత కంపెనీలు.. టాప్ 10లో మనవే 4 సంస్థలు..
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Lifestyle
ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకుంటే శ్రేయస్కరం.. వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
Sai Pallavi రానా టార్చ్ బేరర్.. విరాట పర్వం నా హృదయానికి దగ్గరగా అంటూ ఎమోషనల్
విరాట పర్వం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన విక్టరీ వెంకటేష్ ధన్యవాదాలు. సినిమా ప్రారంభోత్సవం పూజ చేసిన రోజున మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. నాకు ఇంకా గుర్తు ఉంది. మీరు మళ్లీ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడకు వచ్చిన పెద్దలందరికి వెరీ వెరీ థ్యాంక్స్ అని సాయిపల్లవి ఎమోషనల్ అయ్యారు. ఇంకా సినిమా గురించి.. చిత్రంలోని నటీనటులు గురించి మాట్లాడుతూ..

నా సినీ ప్రయాణంలో
విరాటపర్వం అనే సినిమా నా కెరీర్‌లో ఎప్పుడూ గుర్తుండిపోతుంది. సినీ జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన విషయంగా ఉంటుంది. ఈ పాత్రను నా మనసులో నింపుకొని చేశాను. అందుకే నా హృదయానికి నచ్చిన సినిమా అయింది. ఇది ఒ గొప్ప సినిమా. ఈ సినిమాలో నటించినందుకు గొప్ప ఫీల్ ఉంది అని సాయిపల్లవి అన్నారు.

వేణు ఊడుగులకు ధన్యవాదాలు
నన్ను దృష్టిలో పెట్టుకొని గొప్ప కథను రాసిన దర్శకుడు వేణు ఊడుగులకు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఇక ముందు కూడా ఇలాంటి కథలు రాయాలి. నాకు వెన్నెల పాత్రను ఇచ్చినందుకు వేణు గారికి థ్యాంక్స్. ఈ సినిమా కేవలం రానా, సాయిపల్లవి కోసం కాదు. ఇది గొప్ప అనుభూతిని కలిగించే చిత్రం ఇది అని సాయి పల్లవి అన్నారు.

అందరికి రుణపడి ఉంటాను..
విరాట పర్వం సినిమాకు సినిమాటోగ్రఫి, సురేష్ బొబ్బిలి సంగీతం ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాను ఓ దృశ్య కావ్యంలా మలిచారు. ఈ చిత్రంలో నా తల్లిగా నటించిన ఈశ్వరీ రావు, రానా తల్లిగా నటించిన జరీనా వాహెబ్, నవీన్ చంద్ర, సాయిచంద్, రాహుల్, ప్రియమణికి నా థ్యాంక్స్. నిర్మాతలు సుధాకర్ చెరుకూరికి రుణపడి ఉంటాను. ప్రతీ సినిమాను నా పాపలా చూసుకొంటాను. చిన్నపాపకు ఏమైనా అయితే తట్టుకొలేను. విరాటపర్వం కూడా నా బిడ్డలాంటి సినిమా అని సాయిపల్లవి అన్నారు.

రానా టార్చ్ బేరర్..
రానా గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా పెద్ద మనసు, హృదయం ఉన్న వ్యక్తి. నా కోసం మిమ్మల్ని చీర్ చేయమని చెప్పే గొప్ప మనసు ఉన్న వ్యక్తి. సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లాలనే సంకల్పం ఉన్న వ్యక్తి. రానా సినిమా పరిశ్రమకు టార్చ్ బేరర్. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది అని సాయిపల్లవి ఉద్వేగానికి లోనయ్యారు.

మీరు ఆదరిస్తే.. మరిన్ని మంచి చిత్రాలు..
విరాట పర్వం సినిమా జూన్ 17న రిలీజ్ అవుతున్నది. మీ అందరికి ఆ సినిమా నచ్చుతుంది. మీరు ఎన్నో తెలుగు సినిమాలను ఆదరించారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే.. మంచి సినిమాలు మీ ముందుకు వస్తాయి. మీరందరూ ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూస్తారని నమ్ముతున్నాను అని సాయిపల్లవి అన్నారు.