పాపని ఎత్తుకొని మురిసిపోయిన సాయి పల్లవి.. నా ఆలోచనలన్నీ ఇవేనంటూ పోస్ట్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఆమెకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. వెండితెరపై బలమైన పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళంలో ఎన్నో గుర్తుండి పోయే చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక మున్ముందు మరిన్ని భారీ చిత్రాల్లో నటించేందుకు సైన్ చేసింది. తన రాబోయే చిత్రాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తనకు సమయం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలోనూ తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోలను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.
లేటెస్ట్ ఫోస్ట్ తో హాట్ టాపిక్ గ్గా..
అయితే తాజాగా సాయి పల్లవి తన రీసెంట్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. తన ఆలోచనలకు తగిన ఫొటోలకు ఫోజులిచ్చానని చెప్పుకొచ్చింది. నేచర్ కు దగ్గరగా ఉన్న ఫొటోలను, పిల్లలను ఎత్తుకొని దిగిన ఫొటోలను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆ ఫొటోల్లో ముఖ్యంగా పిల్లలతో సాయి పల్లవి సంతోషంగా కనిపిచండం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. సాయి పల్లవికి పిల్లలంటే ఎంతో ఇష్టమని ఇలా చెప్పుకొచ్చిందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే సాయి పల్లవి చెల్లి పెళ్లిచేసుకుంది. ఇంకా సాయి పల్లవి బ్యాచిలర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది.

లేడీ పవర్ స్టార్ గా..
మలయాళ చిత్రం ప్రేమమ్ తో సాయి పల్లవి హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. అంతకు ముందుకు ఢీషోలో డ్యాన్సర్ గా బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఎప్పుడో ఆకట్టుకుంది. ఇక నటిగానూ టాలీవుడ్ లోకి ఫిదా చిత్రంతో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే సాయి పల్లవి తన వ్యక్తిత్వం, సింప్లిసిటీ, ముక్కుసూటిగా మాట్లాడే తత్వంతో కోట్లల్లో అభిమానులను ఏర్పర్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళ చిత్ర పరిశ్రమల్లో మంచి పేరును కూడా సంపాందించుకుంది. ఇమెకు ఉన్న ఫ్యాన్ బేస్ తో లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కూడా అందుకోవడం విశేషం.
సాయి పల్లవి బెస్ట్ ఫిల్మ్స్..
టాలీవుడ్ లోకి సాయి పల్లవి ఫిదా చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తన నేచురల్ యాక్టింగ్, ఒరిజినల్ వాయిస్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనస్సు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, అమరాన్, తండేల్ వంటి చిత్రాల్లో బ్లాక్ బాస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుంది.
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ లో..
చివరిగా సాయి పల్లవి తండేల్ తో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక తొలిసారిగా హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న రామాయణ చిత్రంలో సీత పాత్రను పోషిస్తోంది. రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండటం విశేషం. రావణుడిగా యష్ కనిపించబోతున్నారు. మరోవైపు ఎక్ దిన్ అనే చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. రామాయణ : పార్ట్ 2లోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











