Saipallavi: సాయి పల్లవి బ్యూటీ సీక్రెట్ వైరల్.. లేడీ సూపర్ స్టార్ ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఇవే..
Sai Pallavi: అలనాటి మహానటి సావిత్రి, సౌందర్య వంటి హీరోయిన్ తర్వాత ఇండస్ట్రీలో అంతటి గౌరవాన్ని అందుకున్న నటి సాయి పల్లవి. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరుగని స్థానాన్ని సంపాదించుకుంది. ఆన్ స్క్రీన్ పై గానీ, ఆఫ్ స్క్రీన్ పై కూడా బిహేవియర్ అనే ఉంటుంది. కట్టుబొట్టుకి అంతకంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆమె నయా జనరేషన్ కు ఐకాన్‌గా నిలిచారు. కోట్లాది మంది అభిమానుల సంపాదించుకున్న సాయి పల్లవి తన బ్యూటీ సీక్రెట్లను బయటపెట్టేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ టిప్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇంతకీ సాయి పల్లవి బ్యూటీ సీక్రెట్ ఏంటో మీరూ కూడా ఓ లూక్కేయండి.
అందాల నటి సాయి పల్లవి మలయాళంలో ప్రేమమ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో తన అద్భుత నటనతో మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తో కలిసి 'కాళి' అనే సినిమాలో నటించింది. ఈ మూవీ హిట్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాను 'హే పిల్లగాడా' అనే పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఇక్కడ కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా నటించింది సాయి పల్లవి. ఆమె అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న వరుస అవకాశాలు అందుకుంది. ఇలా తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటించే అవకాశం కొట్టిసిందే. తన కెరీర్ లో వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారింది. సాయి పల్లవి నటించిన అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ లు కొట్టింది. గతేడాది సాయిపల్లవి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ మూవీలో నటించింది. తన నటనతో కదిలించింది.. ఏడ్పించింది. ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
వరుస విజయాలతో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ప్రస్తుతం తండేల్ సినిమాతో అందరినీ పలకరించబోతోంది. ఈ సారి తన ప్రేమలో పడేలా చేసుకోబోతోంది. ఇప్పటికే తండేల్ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్సాన్స్ వస్తుంది. ఈ అందమైన ప్రేమ కథ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఇక ఈ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా మారారు సాయి పల్లవి. ఈ సందర్భంగా సాయి పల్లవి తన బ్యూటీ సీక్రెట్లను బయటపెట్టేశారు.

సాయి పల్లవి ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉంటుందో.. ఆన్ స్క్రీన్‌లోనూ అలానే ఉంటుంది. మేకప్ లేకుండానే సహజంగా కనిపిస్తోంది. ఆ అమ్మడు తన కట్టుబొట్టుతో ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. సాయి పల్లవి నటన, డ్యాన్స్ కోసం సినిమాలకు వెళ్లారంటే అతియోక్తి కాదు. ఈ అమ్మడు తన బ్యూటీ సీక్రెట్లను బయటపెట్టింది. సాయి పల్లవి సెట్స్‌లో ఎక్కువగా కొబ్బరి నీళ్లు మాత్రమే తాగేదంట. అదికూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రతి రోజు ఐదు లీటర్లు తాగుతుందని, ఉదయం నుంచి రాత్రి వరకు తాగుతూనే ఉంటుందట. అలాగే.. ఓ ఆర్టిస్ట్ తన స్కీన్ గురించి ఎలాంటి కేర్ తీసుకుంటాడో, అంతకు మించి తీసుకుంటుంద. అయితే.. మేకప్ దూరంగా ఉంటుందట. ఎక్కవగా సన్ క్రీమ్ రాసుకుంటారంట.


Click it and Unblock the Notifications











