పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. అందుకు కారణం నా తల్లిదండ్రులే: సాయి పల్లవి

ప్రేమమ్ సినిమాతో మాయ చేసిన మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి ఆ వెంటనే తెలుగు ఆడియెన్స్ ని ఫిదా సినిమాతో ఎట్రాక్ట్ చేసింది. సౌత్ ఇండస్ట్రీలో స్థిరపడటానికి ఈ బేబీకి ఎంతో సమయం పట్టలేదు. కెరీర్ మొదట్లోనే కెరీర్ బెస్ట్ హిట్స్ అందుకుంది. ఇక ఆమె పెళ్లిపై టాలీవుడ్ లో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కానీ ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ చాలా క్లియర్ గా తన పెళ్లి మ్యాటర్ గురించి వివరణ ఇచ్చింది.

 గ్లామర్ గీత దాటకుండా..

గ్లామర్ గీత దాటకుండా..

సాయి పల్లవి సినిమాల్లో ఎలా కనిపిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గ్లామర్ రోల్స్ అంటూ అందాలను ఇష్టం వచ్చినట్లుగా అరబోయడం చాలా వరకు కొంత మంది హీరోయిన్స్ కి అలవాటే.. అయితే సాయి పల్లవి మాత్రం ఇంతవరకు అలాంటి పాత్రలకు ఒప్పుకోలేదు. కేవలం ఒక న్యాచురల్ అమ్మాయిలా.. లంగా వోణిలో అలాగే చీరలో కనిపిస్తూ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

ఆడియెన్స్ ఫిదా..

ఆడియెన్స్ ఫిదా..

సాయి పల్లవి సినిమాలో కనిపిస్తే చాలు సినిమాకే ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది. ఆమె సింపుల్ అండ్ రియాలిటీ యాక్టింగ్ కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఫిదా సినిమా విజయంలో కీలకపాత్ర పోషించి లేడి సూపర్ స్టార్ అనిపించుకుంది. యాక్టింగ్ స్కిల్స్ తోనే హీరోల కంటే హై రేంజ్ లో సినిమాకు మంచి క్రేజ్ తేగలరని నీరూపించింది. సాయి పల్లవి సినిమాలో ఉంటే చాలు అనే పరిస్థితికి నిర్మాతలు వచ్చారు అంటే ఆమెకు ఎలాంటి డిమాండ్ ఉందొ చెప్పనవసరం లేదు. అయితే కేవలం తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేసుకుంటూ వెళుతోంది ఈ కేరళ బ్యూటీ.

పెళ్లి రూమర్స్..

పెళ్లి రూమర్స్..

సాయి పల్లవి సినిమాలకు దూరం కానుందనే కథనాలు ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఫిదా బ్యూటీ ఫైనల్ గా తనకు ఇష్టమైన వ్యక్తినే పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. తన టార్గెట్ ప్రస్తుతం సినిమా కెరీర్ పైనే ఉందని వీలైనంత వరకు మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తానని వివరణ ఇచ్చింది.

Recommended Video

Happy Birthday Sai Pallavi : Sai Pallavi Film Career Interesting Facts
 పెళ్లి చేసుకోదట..

పెళ్లి చేసుకోదట..

ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ తన పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చింది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు ఇప్పుడు లేదని భవిష్యత్తులో జరగకపోయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. అందుకు కారణం తన తల్లిదండ్రులే అంటూ.. వారి కోసమే నేను ఆలోచిస్తానని తెలిపింది. వారు ఎక్కడ ఉంటే అక్కడే నా జీవితం, వారిని జాగ్రత్తగా చూసుకోవడమే తన బాధ్యత అంటూ భాన్సువాడ భానుమతి (ఫిదా) తరహాలో ఆలోచిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X