ప్రేమించలేను, పెళ్లి చేసుకోలేను.. అందుకు కారణం నా తల్లిదండ్రులే.. సాయి పల్లవి షాకింగ్ డిసిషన్!

ఫిదా సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ సాయి పల్లవి. ఫిదా సినిమకంటే ముందే సాయి పల్లవి ప్రేమమ్ అనే సినిమాతో తన సొంత భాషలో ఒక స్ట్రాంగ్ హిట్ అందుకుంది. అప్పటి నుంచే అమ్మడికి సంబంధించిన సీక్రెట్ లైఫ్ గురించి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇకపోతే ఇటీవల మరొసారి సాయి పల్లవి పెళ్లి వార్తలపై, ప్రేమ వ్యవహారాలపై అనేక రూమర్స్ వస్తున్నాయి.

ఆ సినిమాతోనే..

ఆ సినిమాతోనే..

ప్రేమమ్ సినిమాతో కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు ఆడియెన్స్ ని కూడా ఈ బ్యూటీ గట్టిగానే ఎట్రాక్ట్ చేసింది. ఇక ఫిదాదో మొదటి హిట్టు పడగానే ఆమె క్రేజ్ మరింత పెరిగింది. నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఈ కేరళ కుట్టి కేవలం తనకు ఇష్టమైన పాత్రలనే ఎంచుకుంటోంది. ఇక రూమర్స్ డోస్ ఎప్పుడు పెరిగినా కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

కాలేజ్ లోనే ప్రేమ..?

కాలేజ్ లోనే ప్రేమ..?

ఇకపోతే ఇటీవల సాయి పల్లవి పెళ్లికి సంబంధించిన రూమర్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా ఆమె ప్రేమలో ఉన్నట్లు కూడా టాక్ వచ్చింది. డాక్టర్ చదివిన సాయి పల్లవి కాలేజ్ రోజుల్లోనే ప్రేమలో పడిందని తన క్లాస్ మెట్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోందని మలయాళం ఇండస్ట్రీలో రూమర్స్ అయితే గట్టిగానే వచ్చాయి. అయితే ఆ రూమర్స్ అన్నిటికీ ఈ బ్యూటీ ఒక్క మాటతో కౌంటర్ ఇచ్చింది.

 కారణం నా తల్లిదండ్రులే..

కారణం నా తల్లిదండ్రులే..

నేను అసలు పెళ్లే చేసుకోవద్దని అనుకుంటున్నాను. అందుకు కారణం నా తల్లిదండ్రులే. నా లైఫ్ లో నాకు వారికంటే ఎవరు ముఖ్యం కాదు. ఆ తరువాత నా సినిమా కెరీర్. ఇంకా నాకు చాలా భవిష్యత్తు ఉంది. వీలైనంత వరకు మంచి సినిమాలు చేసుకుంటూ నా ఫ్యామిలితోనే ఉండాలని బలంగా అనుకున్నాను అని గత ఇంటర్వ్యూలో సాయి పల్లవి చాలా క్లియర్ గా చెప్పేసింది.

Recommended Video

Talasani Sai Kiran Yadav Ditributing Groceries to Journalists & Film Workers
అందులో నిజం లేదట..

అందులో నిజం లేదట..

పెళ్లి చేసుకోలేనని, ప్రేమించలేనని చాలా క్లియర్ గా సాయి పల్లవి చెప్పడంతో ఆమె ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పవచ్చు. ఆమె సన్నిహితులు కూడా అందులో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో విరాటపర్వం అనే సినిమాలో నటిస్తోంది. రానా దగ్గుబాటి, ప్రియమణి కీలకపాత్రలో నటిస్తున్న ఆ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X