twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాయి పల్లవిని భయపెట్టిన ప్రకాష్ రాజ్.. సెట్‌లో అలా ఉండడంతో దడుచుకుందట

    |

    ఫిదా సినిమాతో ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైన కేరళ బ్యూటీ సాయి పల్లవి. ఆమె నటనలో ఎంతగా రాటు దేలిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ ఇటీవల సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గురించి ఉహీంచని విధంగా స్పందించింది. ఆయన కారణంగా దెబ్బకు భయపడినట్లు కూడా ఒక ఇంటర్వ్యూలో మొహమాటం లేకుండా క్లారిటీ ఇచ్చేసింది.

     బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందడంతో..

    బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందడంతో..

    సాయి పల్లవి చాలా వరకు కాంట్రవర్సీలకు దూరంగానే ఉంటుంది. ప్రేమమ్ సినిమాతో మలయాళంలో బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత మెల్లగా ఫిదా సినిమాతో టాలీవుడ్ లో టెంట్ వేసింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందడంతో ఆఫర్స్ కూడా స్పీడ్ గానే అందుకుంది. ఇక వెబ్ సినిమాలలో కూడా నటిస్తూ నటనలో కొత్త తరహా ప్రయోగాలు చేస్తోంది.

    నలుగురు దర్శకులు సెట్ చేసిన కథలో..

    నలుగురు దర్శకులు సెట్ చేసిన కథలో..

    'పావకదైగల్‌' అనే సినిమాలో ప్రకాష్ రాజ్ కుతురిగా నటించిన సాయి పల్లవి ఆ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. దర్శకులు గౌతమ్‌ మేనన్‌, వెట్రి మారన్‌, సుధా కొంగర, విఘ్నేశ్‌ శివన్‌.. వంటి టాలెంటెడ్ దర్శకులు నాలుగు కథలతో రూపొందించిన ఈ వెబ్ సినిమాలో సిమ్రన్‌, అంజలి, జయరాం, కల్కి కొచ్లిన్‌, గౌతమ్‌ మేనన్‌ తదితర పాత్రల్లో కనిపించనున్నారు.

    భయపెట్టిన ప్రకాష్ రాజ్

    భయపెట్టిన ప్రకాష్ రాజ్

    ఇక డిసెంబరు 18న చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి మాట్లాడుతూ సినిమా ప్రతి ఒక్కరి మనసును తాకుతుందని ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుడితో నటించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. అయితే ప్రకాష్ రాజ్ తెలియకుండానే భయపెట్టిన విషయాన్ని ఫిదా బ్యూటీ ఇంటర్వ్యూలో తెలిపింది.

    Recommended Video

    Niharika Konidela wedding Saree Speciality
    గాంభీర్యం చూసి చాలా భయపడేదాన్ని

    గాంభీర్యం చూసి చాలా భయపడేదాన్ని

    తండ్రిగా ప్రకాశ్‌ రాజ్‌ అలా సెట్‌లో నడుచుకుంటూ వస్తే చాలా భయం వేసేది.. ప్రకాష్ రాజ్ మాట్లాడినప్పుడు ఆయన గాంభీర్యం చూసి చాలా భయపడేదాన్ని. దాదాపు సెట్‌లో ఆయన సినిమాకు సంబంధించిన క్యారెక్టర్‌లోనే ఉండేవారు.. అంటూ సాయి పల్లవి పాజిటివ్ గా వివరణ ఇచ్చింది. అయితే అలాంటి సీనియర్ నటులు నుంచి కూడా ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నట్లు తెలిపింది. సాయి పల్లవి నెక్స్ట్ శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

    English summary
    Biopics have become a special attraction in recent times. Some are showing facts up close while others are weaving fictional stories with commercial twists. It seems that the South Indian beautiful heroine soundarya biopic is also coming to the silver screen soon. Clarity is also reported on who will play her role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X