Sai Pallavi: పోలీస్ కేసుపై సాయి పల్లవి ఊహించని సమాధానం.. ఇది సమయం కాదని అంటూ..

సాయి పల్లవి అనగానే ఒక మంచి నటిగా ప్రేక్షకులలో ఒక మంచి భావన ఏర్పడింది. ఆమె ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా కంటెంట్ ఉన్న మంచి సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. అయితే ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. కాశ్మీర్ ఫైల్స్ గురించి అలాగే ఇతర మతస్తుల పై జైశ్రీరామ్ అంటూ జరిగిన దాడిపై ఆమె స్పందించిన విధానం ఓ వర్గం వారిలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అయితే ప్రస్తుతం ఆమె పై కేసులు నమోదవుతున్నాయి. అలాగే పలు హిందూ సంఘాలు కూడా సీరియస్ అవుతున్నాయి. ఇక ఇదే విషయం పై సాయి పల్లవి ప్రశ్నించగా ఆమె ఎవరు ఊహించని విధంగా సమాధానం ఇచ్చారు.

ప్రమోషన్స్ లో బిజీగా..

ప్రమోషన్స్ లో బిజీగా..

విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి పల్లవి ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి మరో కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులు అయితే పాజిటివ్ అంచనాలు ఉన్నాయి. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఒక ప్రత్యేకమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు.

సాయి పల్లవి వ్యాఖ్యలు

సాయి పల్లవి వ్యాఖ్యలు

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ మధ్య వచ్చిన కాశ్మీరి ఫైల్స్ గురించి స్పందిస్తూ అందులో పండితుల పై ఇతర మతస్తులు జరిపిన దాడులు అలాగే కరోనా సమయంలో ఇతర మతస్తులపై జై శ్రీరామ్ అంటూ జరిగిన దాడి.. ఇలా ఇరు వర్గాల మధ్య లో తేడా ఏముంది అని సాయి పల్లవి స్పందించిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

విరాటపర్వంపై ప్రభావం

విరాటపర్వంపై ప్రభావం

సాయి పల్లవి ఆ ఇంటర్వ్యూలో స్పందించిన తర్వాత ఎక్కడ కూడా మళ్లీ దాని గురించి వివరణ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే సాయి పల్లవికి కూడా ఓ వర్గం వారి నుంచి మద్దదు అందుతోంది. ఇక సాయి పల్లవి మీద ఇప్పటివరకు ఉన్న గౌరవం మొత్తం పోయింది అని కూడా కొందరు అంటున్నారు. ఇక ఆమె నటించిన విరాటపర్వం సినిమాను కూడా బాయికాట్ చేయాలి అంటూ మరికొందరు ఆరోపణలు చేశారు.

పోలీస్ కేసు నమోదు

పోలీస్ కేసు నమోదు

అంతేకాకుండా రీసెంట్ గా భజరంగ్ దళ్ కూడా రంగంలోకి వచ్చింది. సాయి పల్లవి వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. అంతేకాకుండా విరాటపర్వం సినిమా టైటిల్ పై కూడా అభ్యంతరాలు ఉన్నాయని వారు సెన్సార్ బోర్డుకు ప్రత్యేకంగా లేఖ కూడా అందించారు. వెంటనే ఆ టైటిల్ ను మార్చాలి అని లేకపోతే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇక సాయిపల్లవి వ్యాఖ్యలు కూడా ఏ మాత్రం కరెక్ట్ కాదు అని పోలీస్ కేసు నమోదు చేశారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా తెలియజేశారు.

 ఇది సమయం కాదన్న సాయి పల్లవి

ఇది సమయం కాదన్న సాయి పల్లవి


అయితే ఈ వివాదం ఎంత సీరియస్ అవుతున్న కూడా సాయిపల్లవి దానిపై ఏమాత్రం స్పందించలేదు. అయితే ఇటీవల ఆమె వైజాగ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు పలువురు మీడియా సభ్యులు ఈ వివాదానికి ముగింపు పలికితే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. కానీ ఆ విషయం పై సాయి పల్లవి ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. దానికి ఇది సమయం కాదు అని.. మరోసారి ప్రత్యేకంగా వివరణ ఇస్తాను అని ఆమె తెలియజేయడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X