Sai Pallavi: ఐటెమ్ సాంగ్స్ ఆఫర్స్ పై ఫిదా బ్యూటీ షాకింగ్ రియాక్షన్.. అన్ని కోట్ల ఆఫర్స్ రిజెక్ట్?
సౌత్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సాయి పల్లవి టాప్ లో ఉంటుంది అని చెప్పాలి. చూడగానే చిరునవ్వుతో ఆకట్టుకునే సాయి పల్లవి చాలా సింపుల్ గా ఉంటూనే నటనతో మాత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది. విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకోవడం లో కూడా ఈ బ్యూటీ చాలా తెలివిగా ఆలోచిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఐటమ్స్ సాంగ్స్ ద్వారా చాలా మంది హీరోయిన్స్ వారి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మంచి క్రేజ్ కూడా వస్తుంది. అయితే ఈ విషయంలో సాయి పల్లవి కూడా కొన్ని ఆఫర్స్ వచ్చినట్లు ఆ మధ్య కాలంలో టాక్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సాయి పల్లవి ఐటమ్ సాంగ్స్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఫ్లాప్స్ వచ్చినా రేంజ్ తగ్గలేదు
సాయి పల్లవి అనగానే అందరికీ ఫిదా సినిమా గుర్తుకు వస్తుంది. అందులో ఆమె నటించిన విధానం ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళంలో ఒకేఒక్క సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఆ తర్వాత తెలుగులో మొదటి సినిమాతోనే తెలుగు వారికి కూడా బాగా దగ్గరైపోయింది. అనంతరం కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆమె రేంజ్ తగ్గలేదు.

నచ్చిన పాత్రలను మాత్రమే..
ప్రేమమ్ సినిమా తర్వాత సాయి పల్లవి కి తెలుగులో ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. కొంత మంది అగ్ర హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే సాయి పల్లవి మాత్రం కేవలం తనకు నచ్చిన పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అని అందులో ఎలాంటి వల్గారిటీ ఉండకూడదు అని అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా ఉండాలి అని ఆలోచించి కథలను సెలెక్ట్ చేసుకుంది.

అలా చేసి ఉంటే 10కోట్లు వచ్చేవి..
ఎంతమంది గ్లామరస్ హీరోయిన్స్ వచ్చినా కూడా సాయి పల్లవికి పోటీ రారు అని చెప్పాలి. ఎందుకంటే ఆ తరహాలో ఆమె తన స్టార్ డమ్ ను మెయింటైన్ చేస్తూ వెళ్తుంది. పెద్దగా హడావుడి లేకుండానే కనిపించే సాయి పల్లవి ఒక సింపుల్ అమ్మాయిలా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. అంతేకాకుండా ఆమె బ్యూటీకి కల్ సంబంధించిన బ్రాండ్ ప్రమోషన్ లో కూడా నటించడానికి ఏ మాత్రం ఒప్పుకోదు. ఒకవేళ అలా చేసి ఉంటే సాయి పల్లవి ఇప్పటివరకు దాదాపు పది కోట్ల ఆదాయం వచ్చే ఉండేదట.

పొట్టి దుస్తుల్లో..
సినిమా ఇండస్ట్రీలో నటన అనేది తన ఫ్యాషన్ అని మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్లు సాయి పల్లవి చాలాసార్లు చెప్పింది. అలాగే గ్లామర్ హైలెట్ అయ్యేలా పొట్టి బట్టలు వేసుకోవడానికి తనకు ఏమాత్రం ఇష్టం ఉండదు అని కూడా సాయిపల్లవి వివరణ ఇచ్చింది. ఆ విషయంలో ఆమె పై చాలా మంది ప్రశంసలు కురిపించారు.

సాయి పల్లవికి భారీ డిమాండ్
ఇక గతంలో సాయి పల్లవి ఐటమ్ సాంగ్స్ లో నటించే అవకాశాలు కూడా వచ్చాయని కానీ ఆమె ఒప్పుకోలేదు అని కూడా కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం సాయి పల్లవి డిమాండ్ ప్రకారం ఆమె ఐటెమ్ సాంగ్స్ చేస్తే 2 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. సాయి పల్లవి నార్మల్ గా మారీ సాంగ్ చేస్తే బిలియన్ వ్యూవ్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఐటెమ్ సాంగ్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పవచ్చు.

ఏ మాత్రం ఇష్టం లేదు
అయితే సాయి పల్లివి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐటెమ్ సాంగ్స్ పై క్లియర్ గా వివరణ ఇచ్చింది. తనకు ఐటమ్ సాంగ్స్ లో నటించడం ఏ మాత్రం ఇష్టం లేదు అని అయినా నాకు అలాంటి సాంగ్స్ సెట్ కావు అని తేల్చి చెప్పేసింది. పొట్టి డ్రెస్ లు తనకు ఏమాత్రం సెట్ కావు అంటూ అలాంటి డ్రెస్ లో డాన్స్ మూమెంట్ సరిగ్గా చేయకపోతే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అని కూడా ఆమె వివరణ ఇచ్చింది. ఫైనల్ గా స్పెషల్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ అనేవి తనకు అంతగా సూట్ అవ్వవు అనే సాయిపల్లవి చాలా బలంగా చెప్పింది.


Click it and Unblock the Notifications











