Pooja Kannan: సినిమాల్లోకి సాయి పల్లవి చెల్లి కూడా.. అలాంటి సినిమాతో షాకింగ్ ఎంట్రీ!

సినిమా రంగంలో నట వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమని అందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరు మాత్రం వారి కుటుంబ సభ్యులులను సినిమాల్లోకి రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ టాలెంట్ ఉంటే మాత్రం మరికొందరు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే సాయి పల్లవి మాత్రం తన సోదరి ఒంటరిగానే అవకాశాలు అందుకునే విధంగా పర్మిషన్ ఇచ్చేసింది. త్వరలోనే సాయి పల్లవి సోదరి పూజ కన్నన్ వెండితెరపై రెగ్యులర్ నటిగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె మొదటి సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు.

అందాల ఆరబోత లేకుండా

అందాల ఆరబోత లేకుండా

సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట డ్యాన్సర్ గా తన కెరీర్ ను బుల్లితెరపై మొదలుపెట్టిన సాయిపల్లవి ఆ తర్వాత వెండితెరపై నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. హీరోయిన్ అనగానే అందరు కూడా ఎక్కువ గ్లామర్ గా కనిపించాలి అనే ఆలోచనతో ఉంటారు. కానీ అనవసరమైన అందాల ఆరబోత లేకుండా సాయి పల్లవి కేవలం నటనతోనే ఎక్కువ అవకాశాలను అందుకుంది. ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక కొత్త పాయింట్ హైలెట్ అవుతూ ఉంటుంది.

కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్

కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. సీనియర్ దర్శకుడు అయినా సరే కథ నచ్చితేనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సాయి పల్లవి. ఇక సినిమా ఇండస్ట్రీలో ఒక కచ్చితమైన పద్ధతిలో పని చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె రీమేక్స్ జోలికి ఏ మాత్రం వెళ్లదు. ఇటీవల మెగాస్టార్ తో ఆఫర్ వచ్చినప్పటికి కూడా ఆమె రిజెక్ట్ చేసింది అంటే ఏ స్థాయిలో ఆలోచిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట వేదాళం రీమేక్ సినిమాలో చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవి అనుకున్నారు. కానీ ఆమె రీమేక్ సినిమాలు చేయనని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. అందుకే ఆ ఆఫర్ను రిజెక్ట్ చేసింది.

సొంత టాలెంట్ తో చెల్లి ఎంట్రీ

సొంత టాలెంట్ తో చెల్లి ఎంట్రీ

ఇక చెల్లెలి ఎంట్రీ పై ఇప్పటివరకు సాయిపల్లవి పెద్దగా స్పందించలేదు. కానీ అవసరమైనంత వరకు ఆమెకు సలహాలు సూచనలు ఇస్తూ మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ అనేది చాలా బరువైంది అని ఇదివరకే క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి, చెల్లెలు తన సొంత టాలెంట్ తోనే అవకాశాలు అందుకుంటే మరింతగా ఆనందిస్తాను అని వివరణ ఇచ్చింది.

Recommended Video

Shyam Singha Roy Teaser : Nani పవర్ఫుల్ పాయింట్... కానీ Pushpa? | Sai Pallavi || Filmibeat Telugu
ఓటీటీలోనే పూజా కన్నన్ మూవీ

ఓటీటీలోనే పూజా కన్నన్ మూవీ

సాయి పల్లవి చెల్లి పూజ కన్నన్ చిత్తిరాయి సెవ్వనం అనే తమిళ సినిమాతో నటిగా తన కెరీర్ ని మొదలు పెడుతోంది. ఈ సినిమాలో సముద్రఖని ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఒక పోస్టర్ లో అయితే సముద్రఖని పూజకన్న ఇద్దరు కూడా సైకిల్ మీద ఎంతో ఆప్యాయంగా ఉన్నట్లు కల్పించారు. చూస్తుంటే ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో ఈ సినిమా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సౌత్ సీనియర్ ఫైట్ మాస్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 5న చిత్తిరాయి సెవ్వనం జీ5 లో విడుదల కాబోతున్నట్లు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X