Sai Pallavi చెల్లెలు టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ.. సినిమా ఆఫర్ ఎలా వచ్చిందంటే?

దక్షిణాదిలో విభిన్నమైన నటిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్న సాయిపల్లవి మరోసారి డిఫరెంట్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నాని, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటిస్తున్న శ్యామ్ సింగరాయ్‌కు సత్యదేవ్ జంగా కథను అందించగా, టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకిృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి దేవదాసి పాత్రతో మరోసారి ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సాయిపల్లవి ఫిల్మీబీట్‌తో ముచ్చటిస్తూ..

దేవదాసి వ్యవస్థ గురించి

దేవదాసి వ్యవస్థ గురించి

దేవదాసి వ్యవస్థ నుంచి గురించి స్కూల్‌లో చదువుకొన్నాను. ఈ పాత్ర కోసం పెద్దగా రీసెర్చ్ నేను చేయలేదు. దర్శకుడు రాహుల్ క్షణ్ణంగా పరిశోధన చేశారు. దేవుడు సేవకురాలిగా దేవదాసీలు ఉండేవారు. కాలం మారుతున్న కొద్ది వారిని తప్పుడు పద్దతిలో వాడుకోవడం మొదలుపెట్టారు. దేవదాసీలు అంటే తప్పుడు పని చేసే వారిగా ప్రొజెక్ట్ చేశారు. కొన్ని ప్రదేశాల్లో దేవదాసిల కాళ్ల కింద పచ్చబొట్టు వేస్తారటా.. అలాంటి అంశాలు సినిమాలో కనిపిస్తాయి. ఈ సినిమా దేవదాసిల గురించి కాదు.. ఓ శ్యామ్ సింగరాయ్ అనే వ్యక్తి గురించి కథ అని సాయిపల్లవి చెప్పారు.

దేవదాసి పాత్రకు పరిమితులు ల్లేవు

దేవదాసి పాత్రకు పరిమితులు ల్లేవు


దేవదాసి పాత్రను చేయడానికి నాకు ఎలాంటి పరిమితులు లేవు. కథ డిమాండ్ చేసినంత వరకు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాను. శ్యామ్ సింగరాయ్ కథలో దేవదాసి పాత్ర ఒకటి. ఆ పాత్రకు కథలో ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్రను నేను బాగా చేశానని అనుకొంటున్నాను. సినిమా రిలీజ్ తర్వాత నేను ఎలా చేశాననేది ప్రేక్షకుల స్పందనను బట్టి తెలుస్తుంది అని సాయిపల్లవి చెప్పారు. ఈ సందర్భంగా తన చెల్లెలు పూజ గురించి తెలియజేశారు.

నా చెల్లెలు పూజ యాక్టింగ్ గురించి

నా చెల్లెలు పూజ యాక్టింగ్ గురించి

నా చెల్లెలు పూజ నాతో తనకు నటించాలని ఉందని ఎన్నడూ చెప్పలేదు. విరాటపర్వం షూటింగ్ సమయంలో ఎవరో మీకు నటించాలని ఉందా? అని అడిగితే ఆసక్తి ఉంది అని చెప్పారట. ఆ విషయాన్ని నాకు రెండేళ్ల తర్వాత చెప్పింది. ఈ మధ్యలో ఎవరో తనను సంప్రదిస్తే సినిమాను పూజ ఒప్పుకొన్నది. ఆ విషయాన్ని కూడా నాకు తర్వాత చెప్పింది. సినిమాల్లోకి నటించాలని తీసుకొన్న నిర్ణయంతో నాకు సంతోషం కలిగింది అని సాయిపల్లవి తెలిపారు.

నాకు భిన్నంగా పూజ ఆలోచనలు

నాకు భిన్నంగా పూజ ఆలోచనలు

నా చెల్లెలు పూజ స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయి. తనకంటూ కొన్ని ఆలోచనలు, అభిప్రాయలు స్పష్టంగా ఉన్నాయి. నా మాదిరిగా సినిమాలు చేయడం, స్క్రిప్టులను ఎంపిక చేసుకోకూడదని నా చెల్లలు భావిస్తున్నది. సాయిపల్లవికి భిన్నంగా నటించాలని అనుకొంటున్నది. సాయి పల్లవి సిస్టర్ అనే గుర్తింపు ఉండకుండా కోరుకొంటున్నది. తన అక్కలా మాదిరిగా చేయకూడదనే నిర్ణయం తీసుకొన్నది. కేవలం పూజ మాదిరిగానే తెరపైన కనిపించాలని అనుకొంటున్నారు అని సాయిపల్లవి చెప్పారు.

గ్లామర్ రోల్స్‌తోపాటు అన్ని రకాలు పాత్రలతో

గ్లామర్ రోల్స్‌తోపాటు అన్ని రకాలు పాత్రలతో

నా మాదిరిగా విభిన్నమైన పాత్రలతోపాటు, ప్రేక్షకులు మెచ్చే విధంగా గ్లామర్ రోల్స్ చేసే ఆలోచన ఉంది. తన ఇష్టాఇష్టాలు భిన్నంగా ఉంటాయి. తన అభిరుచి డిఫరెంట్‌గా ఉంటుంది. తాను ఎంజాయ్ చేసే ఫిలింస్ వేరే ఉన్నాయి. సినిమాల విషయంలో తన టేస్ట్ కూడా వేరే ఉంటాయి. ఏదైనా తనకు ఇష్టమైన పాత్రలు చేయాలని కోరుకొంటున్నది అని సాయిపల్లవి చెప్పారు.

Recommended Video

Sai Pallavi Heartfelt Speech About Nagarjuna In Love Story Success Meet
నాకు పోటీ అంటే ఒప్పుకోను..

నాకు పోటీ అంటే ఒప్పుకోను..

పూజ తనకు పోటిగా మారుతుందని నేను అనుకోను. సినిమా పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. ఎవరి టాలెంట్ వారిది. ఎవరి క్రేజ్ వారిది. పోటీ అనే విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోను. పూజ నాకు పోటీ అంటే నేను ఒప్పుకొను. సినిమా పట్ల ఆమెకు ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి అని సాయిపల్లవి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X