twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి.. అది మన బాధ్యత.. సాయి పల్లవి కామెంట్స్

    |

    మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, వారి భద్రతకు గానూ హైద్రాబాద్ పోలీసులు ఓ ప్రత్యేకమైన యాప్‌ను ప్రారంభించారు. షీ ఎమ్ పవర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీసు విభాగం.. షీ సేఫ్ అనే యాప్‌ను ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో సాయి పల్లవి తన స్పీచ్‌తో అందరి మనసులను గెలుచుకుంది. ఇంతకీ ఆమె ఏం మాట్లాడిన విషయాలేంటో ఓ సారి చూద్దాం.

    గర్వంగా ఉంది..

    గర్వంగా ఉంది..


    ఇక్కడి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. తానేం సాధించానో తెలీదు కానీ ఇక్కడ ఇలా అందరి మధ్య ఉన్నందుకు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది.

    ప్రత్యేకమైన యాప్..

    ప్రత్యేకమైన యాప్..

    మహిళల రక్షణార్థం హైద్రాబాద్ పోలీసులు ఓ ప్రత్యేకమైన యాప్‌ను క్రియేట్ చేశారని చెప్పుకొచ్చింది. అది చాలా సంతోషకరమైన విషయమని తెలిపింది. మహిళలకు చేదు ఘటనలు ఎదురైతే బయటకు చెప్పుకోవడానికి రెండు కారణాలుంటాయని పేర్కొంది.

    వేరే వారికి జరగకూడదని..

    వేరే వారికి జరగకూడదని..


    ఎవరికైనా చేదు అనుభవాలు ఎదురైతే.. మరొకరికి అలాంటి ఘటనలు జరగకూడదని బయటకు చెబుతుందని తెలిపింది. లేదా తన బాధను కొంతైన తగ్గించుకోవడానికి తన స్నేహితులతోనో, ఇంట్లో వారితోనో, భర్తతోనో చెప్పుకుంటుందని పేర్కొంది.

    మార్పు ఇంట్లోనే మొదలవ్వాలి..

    మార్పు ఇంట్లోనే మొదలవ్వాలి..


    మహిళలపై ప్రమాదాలను అరికట్టాలంటే క్రమశిక్షణ నేర్పాలని, అది మన ఇంటి నుంచే మొదలవ్వాలని పిలుపు నిచ్చింది. సమాజంలో జరిగే వాటికి పోలీసులనో, ఇంకెవరినో దూషించడం కన్నా.. మహిళలను ఎలా చూడాలి, ఎలా గౌరవించాలన్న విషయాన్ని ఇంట్లోనే నేర్పించాలని చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Actress Sai Pallavi In Parkal Bus Stand || Virata Parvam Movie Shooting ||
    అది మన బాధ్యత..

    అది మన బాధ్యత..


    పిల్లలు ఏం చేస్తున్నారని చూడటం, మంచి విషయాలు నేర్పడం అందరి బాధ్యత అని తెలిపింది. ఇంట్లో మీరు భార్యను ఎలా చూస్తారో.. మీ పిల్లలు కూడా బయట అలానే చేస్తారు.. మీరు ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అలానే ప్రవర్తిస్తారని చెప్పుకొచ్చింది. పిల్లలు ఏదో అవుతారని కలలు కంటారు కదా.. అవి నెరవేరకపోయినా పర్లేదు కానీ సమాజానికి హాని చేయకుండా ఉండేట్టు పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పుకొచ్చింది. సాయి పల్లవి ప్రస్తుతం విరాట పర్వం, లవ్ స్టోరీ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

    English summary
    Sai Pallavi Speech At She M Power Event. She M Power Event Is Held By Hyderabad police. And They Launched She Safe App.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X