Sai Pallavi రూమర్లకు తెరదించిన సాయిపల్లవి.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఆ స్టార్ హీరోతో మూవీ!
దక్షిణాదిలో టాలెంటెడ్ అండ్ టాప్ హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే డబ్బు కోసం కాకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలనే చేస్తుంటారనేది ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే.. రెమ్యునరేషన్ భారీగా ఇస్తామని చెప్పినా సాయిపల్లవి లొంగకుండా సున్నితంగా తిరస్కరించిన సందర్బాలు కూడా ఎక్కువే. అలాంటి సాయిపల్లవి తాజాగా తెలుగు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..
గతేడాది కార్తికేయ 2 సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ ఇచ్చిన చందూ మొండేటి గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో మరో సినిమాకు సిద్దమవుతున్నాడు. నాగాచైతన్య హీరోగా కాకినాడ బ్యాక్ డ్రాప్‌గా జాలర్ల జీవితాల కథాంశంతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి నటించేందుకు ఒకే చెప్పింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు, అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నటించేందుకు సిద్దమైన సాయి పల్లవి మంగళవారం (సెప్టెంబర్ 19వ) తేదీన హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో జరిగిన కథా చర్చలు, ఇతర డిస్కషన్స్‌లో సాయిపల్లవి పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
అయితే కస్టడీ తర్వాత నాగచైతన్య చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లవ్ స్టోరి సినిమా తర్వాత మళ్లీ నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించడం గమనార్హం. వీరిద్దరి కలయికలో వచ్చిన లవ్ స్టోరి చిత్రం భారీ విజయం అందుకొన్న విషయం తెలిసిందే. మళ్లీ ఈ జంట తమ అభిమానుల ముందుకు వస్తున్నారనే వార్త సినీ వర్గాల మరింత ఉత్సాహం రేపింది.

ఇక సాయిపల్లవి సినిమాల విషయానికి వస్తే.. రాజుకుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో శివ కార్తీకేయన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం బయోపిక్ కావడం గమనార్హం. ఇక అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో ఆయన తనయుడితో కలిసి ఓ హిందీ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపిందనే వార్త ప్రచారంలో ఉంది. అలాగే మధు మంతెన నిర్మించే రామాయణం సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సాయిపల్లవి నటిస్తున్నారనే వార్త కూడా వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











