తన టాలెంట్ కు తగ్గ జాబ్ పట్టేసిన సాయిపల్లవి, కొరియోగ్రఫర్ గా మారనున్న బ్యూటీ
చేప పిల్లకు ఎవరన్నా ఈత నేర్పుతారా..! అలాగే సాయిపల్లవికి డాన్స్ కొరియోగ్రఫీ చేయడం కూడా అలాంటిదే. టీనేజ్ లో ఉన్నప్పుడే డాన్సు ప్రోగ్రాముల్లో దుమ్ము రేపేసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు హీరోయిన్ గా ఓ రేంజ్ లో రఫ్పాడించేస్తోంది. అయితే ఇన్నాళ్లూ అమ్మడి డాన్సింగ్ స్కిల్స్ ను దర్శక నిర్మాతలు పెద్దగా వాడుకున్నది లేదు. అందుకే శేఖర్ కమ్ముల అమ్మడి టాలెంట్ ను పూర్తిగా వాడేయాలని ఫిక్స్ అయ్యాడట.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి లవర్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యకు జోడీగా అమ్మడు కనిపించబోతోంది. ఇక ఆ మధ్య విడుదలైన టీజర్, జనాలకు బాగా నచ్చేసిందని చెప్పాల్సిందే. సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తవ్వగా, ఇంకా 2 వారల చిత్రీకరణ మాత్రం మిగిలిపోయిందని తెలుస్తోంది. ఇందులో ఓ సాంగ్ కూడా ఉందట.

అయితే ఈ పాటకు కొరియోగ్రఫీ బాధ్యతలు కూడా తీసుకోవాల్సిందిగా శేఖర్ కమ్ముల, సాయి పల్లవిని కోరాడట. ఇలాంటి అవకాశం కోసమే వెయిట్ చేస్తున్న సాయి పల్లవి వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని వినికిడి. త్వరలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాట తెరకెక్కనుంది. ఏమైనా ఇన్నాళ్లూ వారినీ వీరినీ అనుకరించిన సాయి పల్లవి, ఇకపై తానే ఓ ట్రెంట్ సేట్ చేసేందుకు రెడీ అవుతోంది. మరి ఇందులోనూ అమ్మడు వందకు వంద మార్కులు వేయించుకుంటుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











