ఇక ఈ ఏడాది సాయి పల్లవి సినిమాలు లేనట్లే..?
మలయాళం బ్యూటీ సాయి పల్లవి ఈ ఏడాది వెండితెరకు దాదాపు దురమైనట్లే అనిపిస్తోంది. కరోనా వైరస్ ధాటికి షూటింగ్స్ ఆగిపోవడంతో ఎన్నో సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇక సగంలో ఆగిపోయిన షూటింగ్స్ ని పూర్తి చేయడానికి కొందరు నానా తంటాలు పడుతున్నారు. మరికొందరు షూటింగ్స్ కి మరో ఏడాది వరకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. సాయి పల్లవి కూడా ఈ ఏడాది వీలైనంత వరకు షూటింగ్స్ లకు దూరంగానే ఉండనుందట. ఈ నిర్ణయంతో ఈ ఏడాది ఫిదా బ్యూటీని తెలుగు ఆడియెన్స్ మిస్ అవుతున్నారనే చెప్పాలి. తెలుగులో చివరగా పడి పడి లేచి మనసు సినిమా తరువాత మళ్ళీ డైరెక్ట్ సినిమా చేయలేదు.
NGK ద్వారా కూడా పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది.

ఇక విరటపర్వం సినిమా 2021కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతిలో ఉన్న శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల కానున్నట్లు టాక్ వస్తోంది. ఎందుకంటే థియేటర్స్ ఈ ఏడాది తెరుచుకునే అవకాశం లేదని, ఒకవేళ తెరచుకున్నా కూడా జనాలు అంతగా రారని చాలా మంది సినీ ప్రముఖులు చెబుతున్నారు. అందుకే సినిమాల విడుదల డేట్స్ వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











