గుట్టు చప్పుడు కాకుండా వెళ్దామనుకుంది.. అడ్డంగా దొరికేసిన నటి.. వీడియో వైరల్
ఒకప్పుడు సినిమాను సహజ సిద్దంగా తెరకెక్కించేవారు. కూరగాయాల మార్కెట్ అయినా, థియేటర్ సీన్లైనా, ఏదైనా జనసమూహం ఉన్న రోడ్లైనా సరే న్యాచురల్ లుక్ వచ్చేందుకు అందరి మధ్య ఉండగానే తీసేవారు. అప్పట్లో అలా జరిగేది కానీ.. నేటి పరిస్థితులో అలా షూటింగ్లను పూర్తి చేయలేము. ఓ హీరోనో, లేక హీరోయినో రోడ్డుపై అందరి మధ్య నడిస్తే అసలు షూటింగ్ కాదు కదా.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అందుకే అన్నీ సెట్టింగ్ల మయం అయిపోతున్నాయి. కాదు కూడదు అనుకుంటే పక్క రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి షూటింగ్‌లు చేసుకోవాలి.

సహజత్వానికి దగ్గరగా శేఖర్ కమ్ముల చిత్రాలు..
సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములకు మంచి పేరుంది. ఆయన తీసిన సినిమాలన్నీ అదే కోవకు చెందుతాయి. హ్యాపీడేస్, లీడర్, గోదావరి, ఆనంద్ ఇలా ఏ సినిమాను తీసుకున్నా.. మన పక్కింట్లో జరిగినట్టే ఉంటాయి సీన్లు. చాలా రోజుల తరువాత ఫిదా చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు శేఖర్ కమ్ముల. అయితే ఆ చిత్రం వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా మరో ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయాడు.

మరో లవ్ ఎంటర్టైనర్‌తో..
ఫిదా లాంటి అందమైన ప్రేమకథను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల.. మళ్లీ అలాంటి కథతోనే ప్రయోగం చేయబోతోన్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి, నాగ చైతన్యలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా చకచకా జరిగిపోతోంది. ఈ క్రమంలోనే రియలిస్టిక్‌గా ఉండాలని ఓ ప్రయోగం కూడా చేశాడు.
బెడిసి కొట్టిన ప్రయత్నం..
సన్నివేశం సహజంగా ఉండాలని, రియలిస్టిక్ ఫీలింగ్ తీసుకువచ్చేందుకు జనం తిరిగే ప్రదేశాల్లోనే సీన్ తీయాలని శేఖర్ కమ్ముల అనుకున్నాడట. దీని కోసం నగరంలోని పద్మారావ్ నగర్‌ను ఎంచుకున్నాడు. రోడ్డుపై నడుస్తూ.. ఓ ఇంట్లోకి సాయి పల్లవి వెళ్లే సీన్ అది. అయితే వారు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.

వీడియో రికార్డ్..
రోడ్డుపై సాయి పల్లవిని చూసిన అభిమానులు ఊరికే ఉంటారా.. ఆ సీన్స్‌ను తమ ఫోన్లో బంధించారు. రోడ్డుపై నడుస్తూ గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లోకి వెళ్లే సీన్ కాస్త.. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇలా సహజత్వంగా ఉండాలని ప్రయత్నించి.. లీకుల బారిన పడటం వృథా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. విరాట పర్వం మూవీ షూటింగ్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవ్వడం విశేషం.


Click it and Unblock the Notifications











