సాయి పల్లవి టాలెంట్‌ని ఎవరు గుర్తించడం లేదట.. అలాంటి సినిమా కావలంటోంది!

ఫిదా సినిమాతో తెలుగు తెరకు స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి. గ్లామర్ ప్రజెంటేషన్ లేకుండా కేవలం ఒక నార్మల్ అమ్మాయిలానే కనిపిస్తూ అద్భుతమైన నటనతో అవకాశాలు అందుకుంటోంది. సాయి పల్లవి చాలా వరకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. వీలైనంత వరకు అమ్మడు కమర్షియల్ సినిమాలను దూరం పెడుతోంది.

అయితే తెలుగులో మొదటి సినిమా తరువాత ఈ బ్యూటీ అనుకున్నంతగా బాక్సాఫీస్ హిట్టయితే అందుకోలేదనే చెప్పాలి. నాని MCA పరవాలేదు అనిపించినా కూడా శర్వానంద్ తో చేసిన పడిపడి లేచే మనసు సినిమా ఉహీంచని విధంగా డిజాస్టర్ అయ్యింది. అయితే ఇప్పటివరకు తన అసలైన టాలెంట్ ని ఎవరు కూడా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని సాయి పల్లవి చెబుతోంది.

Sai pallavi wants different dance based stories

ఎందుకంటే సాయి పల్లవి డ్యాన్స్ కి ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎక్కువగా దొరకడం లేదట. మారీ 2లో ధనుష్ తో చేసిన సాంగ్ ఏ స్థాయిలో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా సాంగ్ వైరల్ అయ్యింది కాబట్టి ఎవరైనా డ్యాన్స్ కి స్కోప్ ఉన్న కథలతో వస్తారని అనుకుందట. కానీ తమిళ్ లోనే కాకుండా తెలుగు నుంచి కూడా ఎవరు అలాంటి కథలను చెప్పడం లేదని సాయి పల్లవి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

వీలైనంత వరకు కెరీర్ ఎండ్ అయ్యే లోగా మంచి డ్యాన్స్ బేసిడ్ సినిమా చేయాలని సాయి పల్లవి ఒక స్ట్రాంగ్ డిసిషన్ టీబసుకున్నట్లు తెలుస్తోంది. మరి అమ్మడి రేంజ్ కి తగ్గట్లు ఫ్యూచర్ లో అలాంటి కథలు ఏమైనా వస్తాయో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X