మణిరత్నం ప్రాజెక్టులో సాయి పల్లవి.. 9మంది దర్శకులతో వెబ్ సిరీస్ ప్లాన్?
ఇండియన్ ఆల్ టైమ్ బెస్ట్ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం కూడా డిజిటల్ వరల్డ్ లోకి రాబోతున్నారు. కానీ దర్శకుడిగా కాదు. కేవలం నిర్మాతగా ఉంటూ తన సొంత ప్రొడక్షన్ లోనే శిష్యులకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వనున్నారట. ఈ మంచి ప్రయత్నంలో ఇతర కోలీవుడ్ సీనియర్ దర్శకులు కూడా చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ అనే బిగ్ బడ్జెట్ హిస్టారికల్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇక నెక్స్ట్ 9 మంది దర్శకులతో ఒక మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో కథను రెడీ చేసి 9 ఎపిసోడ్స్ గా వెబ్ సిరీస్ కోసం చిత్రీకరించనున్నారట. ఈ వెబ్ కంటెంట్ లోని ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో దర్శకుడు వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అందులో మొదటి ఎపిసోడ్ లో సాయి పల్లవి కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవికి ఆ వెబ్ సిరీస్ కోసం మణిరత్నం స్పెషల్ గా ఫోన్ చేసినట్లు టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం అగ్ర దర్శకులతో స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటున్న సాయి పల్లవి తనకు ఎంతో ఇష్టమైన మణిరత్నంతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటోంది. అయితే ఆయన డైరెక్షన్ లో కాకపోయినా ఆయన టేస్ట్ కి తగ్గట్టుగా నిర్మాతగా రూపొందిస్తున్న సినిమాలో అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.
ప్రస్తుతం సాయి పల్లవి చేతినిండా మంచి సినిమాలే ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగ చైతన్య లవ్ స్టోరీ షూటింగ్ ఏండింగ్ దశలో ఉండగా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత విరాటపర్వం అనే డిఫరెంట్ సినిమాతో రానుంది. ఇక శర్వానంద్ తో కూడా ఒక సినిమకు కమిటైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











