Sai Pallavi: మట్టి మనుషులతో ఫిదా బ్యూటీ.. ఇలా చూస్తే ఎవరైనా సరే ఆమెకు పడిపోవాల్సిందే!

సినిమా ప్రపంచం లో స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వాలంటే గ్లామర్ డోస్ తప్పనిసరిగా పెంచుతూ ఉండాలి అని కొంతమంది అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం టాలెంట్ ఉంటే చాలు అని అంటారు. ఎవరికి వారు వారికి నచ్చిన పద్ధతుల్లో సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఈ సినిమా ప్రపంచంలో అందరికంటే ప్రత్యేకంగా ఉండే వారిలో సాయిపల్లవి ఒకరు.

ఆమె ఎంత ప్రత్యేకం అంటే ఒకవైపు స్టార్ హోదా అందనంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా నేలపైనే ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తేనే ఆ విషయం చాలా ఈజీగా అర్థమవుతుంది.

 చదువు.. యాక్టింగ్

చదువు.. యాక్టింగ్

సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ కావడానికి కొంతమంది వారి పర్సనల్ విషయాలను కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ సినిమా కెరీర్ తో చదువు కూడా చాలా ముఖ్యమని సాయిపల్లవి ఆలోచిస్తుంది. ఆమె డాక్టర్ అవ్వాలని చిన్నప్పటినుంచే వారి తల్లిదండ్రులు కోరుకున్నారు. అంతేకాకుండా తనకు ఇష్టమైన సినీ ఫీల్డ్ లో కూడా సాయి పల్లవి ఉండాలని అనుకుంది.

అగ్ర హీరోలు కూడా..

అగ్ర హీరోలు కూడా..

ఒకవైపు తన పేరెంట్స్ కోసం డాక్టర్ చదువు కొనసాగిస్తూనే మరొకవైపు తనకు ఎంతో ఇష్టమైన సినిమా ఫీల్డ్ లో కూడా కొనసాగుతోంది. మొదట డాన్సర్ గా మొదలైన ఆ ప్రయాణం ప్రస్తుతం సినిమాల్లో ప్రధాన హీరోయిన్ గా కొనసాగే వరకు వచ్చింది. ఆమెతో నటించాలని ప్రస్తుతం అగ్ర హీరోలు కూడా ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం కేవలం కంటెంట్ నచ్చితేనే సినిమా చేసేందుకు ఒప్పుకుంటోంది.

ఆ స్నేహితులతో ఇంకా అదే స్నేహం

ఆ స్నేహితులతో ఇంకా అదే స్నేహం

ఇక సాయి పల్లవి పర్సనల్ లైఫ్ కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది అని అప్పుడప్పుడు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. సాయి పల్లవి స్నేహితులు చాలా వరకు మిడిల్ క్లాస్ కు చెందినవారే.. అయినప్పటికీ ఆమె తన స్టార్ హోదా పెరిగిన తర్వాత కూడా వారిని ఏ మాత్రం వదలలేదు. అప్పుడప్పుడు తన స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్స్ కు కూడా వెళ్తుంది.

మట్టి మనుషులతో.. అందంగా..

మట్టి మనుషులతో.. అందంగా..

ఇక రీసెంట్ గా సాయి పల్లవి ఒక పొలంలో మట్టి మనుషుల మధ్య లో కలిసి పోయింది. అక్కడ ఉన్న ఆడవారు పొలం పనుల్లో ఉండగా అదే తరహాలో సాయిపల్లవి కూడా ఆ మనుషుల తరహాలోనే కనిపించడం విశేషం. వారితో కలిసి ప్రత్యేకంగా పని కూడా చేసినట్లు ఆమె ఉన్న విధానం చూస్తే అర్థం అవుతోంది.

షూటింగ్ ఫొటోస్ అనుకున్నారు..

షూటింగ్ ఫొటోస్ అనుకున్నారు..

సినిమా ప్రపంచంలో ఎంతగానో స్టార్ హోదా ను చూసిన సాయిపల్లవి ఆ పొలంలో మాత్రం చెప్పులు లేకుండా మిగతా వారితో కలిసి చాలా సింపుల్ గా ఉంది. మొదట ఈ ఫోటోలు ఏదైనా షూటింగ్ కు సంబంధించినవి కావచ్చు అని అనుకున్నారు. కానీ సాయిపల్లవి నేచర్ ను చాలా ఇష్టపడుతుంది. అంతేకాకుండా వ్యవసాయం చేసేవారు అంటే కూడా ఆమెకు ఎంతో ప్రత్యేకమైన గౌరవం. ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం తో అవి నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
పాజిటివ్ కామెంట్స్

పాజిటివ్ కామెంట్స్

ఇక సాయి పల్లవి పోస్ట్ చేసిన ఫోటోలు చూసిన అభిమానులు చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. నీకంటే అందంగా ఎవరూ ఉండరు అని ఈరోజుల్లో సోషల్ మీడియాను కూడా చాలా మంది బిజినెస్ గా మార్చుకుంటున్నారు. కొందరు పబ్లిసిటీ కోసం హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ సాయిపల్లవి మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉంటూ తన పర్సనల్ లైఫ్ ను చాలా సింపుల్ గా కొనసాగిస్తూ ఉండటం విశేషం.. అని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X