సైంధవ్ బ్యూటీ ఓవర్ డోస్ గ్లామర్ షో.. చూశారంటే కిక్కు ఎక్కాల్సిందే!

టాలీవుడ్‌లో ఇప్పుడు చాలా మందే హీరోయిన్లు ఉన్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని వరుసగా ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో పంజాబీ చిన్నది రుహానీ శర్మ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో మాయ చేస్తోన్న ఈ భామ.. తెలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మధ్య కాలంలో మరింతగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే రుహానీ శర్మ తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. అవి మీరే చూడండి మరి!

ఆ వీడియోలతో గుర్తింపు:హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే రుహానీ శర్మ మోడల్‌గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి ఆల్బమ్స్ చేసింది. వీటికి మంచి స్పందన రావడంతో రుహానీ యమ క్రేజ్ తెచ్చుకుంది. అదే సమయంలో ఈ చిన్నది సినీ ప్రముఖుల దృష్టిలోనూ పడిపోయింది.

Saindhav Actress Ruhani Sharma Beautiful Looking Photos Viral

డీసెంట్ సినిమాతో సత్తా:ఆల్బమ్‌లలో సెన్సేషన్ అయిపోయిన రుహానీ శర్మ 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని హైలైట్ అయిపోయింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా ఎంటరైంది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు దక్కడంతో ఆమె పేరు మారుమ్రోగింది.

ఆఫర్లు భారీగానే వచ్చినా:నేషనల్ అవార్డు వచ్చిన చిత్రంతో సత్తా చాటిన రుహానీ శర్మకు ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు లభించాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ, ఇందులో హిట్ మినహా భారీ విజయాన్ని దక్కలేదు. దీంతో రుహానీ కెరీర్ ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ కావడం లేదు.

Saindhav Actress Ruhani Sharma Beautiful Looking Photos Viral

వెంకీ మూవీతో సందడిగా:టాలెంటె, అందం ఉన్నా ఇబ్బందులు పడుతోన్న రుహానీ శర్మ 2019లో 'పాయిజన్' అనే హిందీ వెబ్ సిరీస్‌‌లో నటించింది. అలాగే, తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌లోనూ చేసింది. అంతేకాదు, హిందీలో 'ఆగ్రా' మూవీ చేస్తోంది. ఇటీవలే తెలుగులో రుహానీ 'HER Chapter 1', ఇప్పుడు వెంకటేష్ - శైలేష్ కొలను 'సైంధవ్' మూవీలోనూ చేసింది.

సోషల్ మీడియాతో క్రేజ్:సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న రుహానీ శర్మ.. హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత నుంచి మరింతగా ఇందులో యాక్టివ్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది.

Saindhav Actress Ruhani Sharma Beautiful Looking Photos Viral

అందాలను ప్రదర్శిస్తూ:సోషల్ మీడియాలో రుహానీ శర్మ ఏ రేంజ్‌లో అందాలను ఆరబోస్తుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన బోల్డు ఫొటోలు, వీడియోలు వదులుతూ సంచలనం అవుతోంది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఆమె పేరు సెన్సేషన్ అవుతోంది.

జాకెట్ లేకుండా ట్రీట్:ఈ మధ్య యమా రెచ్చిపోతోన్న రుహానీ శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అతి జాకెట్ లేకుండా చీర కట్టుకుని విపరీతంగా గ్లామర్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ యమ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X