‘సైరాత్’ హీరోయిన్ ఇంటర్మీడియట్ రిజల్ట్ హాట్ టాపిక్

మరాఠి చిత్రం 'సైరాత్' ఓ సంచలనం. 2016లో విడుదలైన ఈ ప్రాంతీయ చిత్రం అప్పట్లో రూ. 100 కోట్లు వసూలు చేసి సంచలనం క్రియేట్ చేసింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన రింకూ రాజ్ గురు సినిమా షూటింగ్ సమయంలో పాఠశాల విద్యను అభ్యసిస్తోంది.

'సైరాత్' సినిమా కారణంగా మంచి ఫేమ్ వచ్చినప్పటికీ ఆమె తన చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. తాజాగా విడుదలైన మహరాష్ట్ర హెచ్ఎస్‌సి(ఇంటర్మీడియట్) ఫలితాల్లో 82 శాతం మార్కులతో పాసైంది. ఇంగ్లీషులో 54 మార్కులు, మరాఠిలో 86 మార్కులు, పొలిటికల్ సైన్స్‌లో 83 మార్కులు, ఎకనమిక్స్‌లో 77 మార్కులు, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్లో 49 మార్కులు సాధించింది.

Sairat Actress Rinku Rajguru HSC Result hot topic

సినిమాల్లో కొనసాగుతూనే రింకూ తన గ్రాజ్యుయేషన్ పూర్తి చేస్తుందని... రెండింటినీ మేనేజ్ చేయగల తెలివి తన కూతురుకు ఉందని రింకూ తండ్రి మహదేవ్ రాజ్‌గురు తెలిపారు. రింకూ 10వ తరగతిలో 66.40% మార్కులు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

'సైరాత్' చిత్రంతో రింకూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు ఆమె రెండు నేషనల్ ఫిల్మ్ (స్పెషల్ మెన్షన్, స్పెషల్ జ్యూరీ) అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ తర్వాత మనసు మల్లిగె, కాగర్, ఝండ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రింకూ కర్ణాటకలోని బెల్గామ్‌లో జరుగుతున్న ఓ మరాఠి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X