‘ఆ డైరెక్టర్‌తో పడుకోమని.. ఎదిరించే ధైర్యం లేక, 19 ఏళ్లకే’

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల గురించి టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో నిత్యం ఎవరో ఒక నటి సంచలన విషయాలు బయటపెడుతూ బాంబు పేలుస్తున్నారు. గత నెలలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో , హీరోయిన్ విన్సీల వ్యవహారం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. పైకి పెద్ద మనుషులుగా చలామణీ అవుతూ చీకటి పనులు చేసే ఎంతో మందికి సంబంధించిన వివరాలను నటీనటులు బయటపెడుతూనే ఉన్నారు.

బుల్లితెరకూ పాకిన క్యాస్టింగ్ కౌచ్

వెండితెర మీదే కాదు.. బుల్లితెర కూడా క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులకు అతీతం కాదని అంటున్నారు. మీటూ ఉద్యమం సమయంలో ఎంతో మంది టెలివిజన్ ఇండస్ట్రీకి చెందిన నటీమణులు తమపై జరిగిన వేధింపులను బయటపెట్టారు. ఇక గతేడాది మలయాళ చిత్ర పరిశ్రమలో చీకటి వ్యవహారాలు, మహిళా నటులపై లైంగిక వేధింపుల గురించి జస్టిస్ హేమ్ కమిటీ రిపోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా తెలుగు, హిందీ ఇండస్ట్రీలలో హీరోయిన్‌గా రాణిస్తోన్న సయామీ ఖేర్ తాను ఎదుర్కొన్న క్యాస్టిక్ కౌచ్, వేధింపుల గురించి బయటపెట్టారు.

Saiyami Kher about casting couch Jaat Actress reveals shocking incident at her beginning days

రేయ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

నాసిక్‌కు చెందిన సయామీ ఖేర్ .. 2015లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించి రేయ్ చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోవడంతో టాలీవుడ్‌కు దూరమైన సయామీ.. ఆ తర్వాత హిందీ, మరాఠీ పరిశ్రమలకే పరిమితమైంది. 2021లో కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన వైల్డ్ డాగ్ ద్వారా తిరిగి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ వెంటనే హైవేలో నటించారు. రెండోసారి కూడా తనను దురదృష్టం వెంటాడటంతో టాలీవుడ్‌ను పక్కనపెట్టేశారు సయామీ.

జాట్‌లో పవర్‌ఫుల్ యాక్టింగ్

హిందీలోనే 8 ఏఎం మెట్రో, ఘూమెర్, శర్మాజీ కీ బేటీ, అగ్ని చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది బాలీవుడ్ సూపర్‌స్టార్ సన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్‌లో ఎస్ఐ విజయలక్ష్మీగా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో పవర్‌‌ఫుల్ యాక్టింగ్‌తో పాటు సెంటిమెంట్‌ను కూడా పండించారు సయామీ ఖేర్. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన సినిమాలు, కెరీర్, ఇండస్ట్రీలో ఎదుర్కొన్న విషయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

దర్శకుడు కమిట్‌మెంట్ అడిగాడు

నటిగా తన కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం చూస్తున్న సమయంలో ఓ తెలుగు సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపారు. తనను ఓ దర్శకుడు కమిట్‌మెంట్ అడిగాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు 19, 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ లేడీ ఏజెంట్ తనను సంప్రదించి సినిమాలలో ఛాన్సులు రావాలన్నా, నిలదొక్కుకోవాలన్నా సర్దుకుపోవాలని చెప్పిందని ఆమె మాటలలోని ఆంతర్యం ఏంటో నాకు అర్ధమైందని, కానీ ఆమె ముందు అర్ధం కానట్లు నటిస్తూ పదే పదే అడగటంతో ఆమె అదే విషయం చెప్పిందని సయామీ అన్నారు.

నాకంత ధైర్యం లేక

తనకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయని వాటిని ఎప్పటికీ దాటనని సున్నితంగా ఆమెకు నో చెప్పినట్లు వెల్లడించారు. తన కెరీర్‌లో ఒకే ఒక్కసారి కమిట్‌మెంట్ లాంటి చేదు అనుభవం ఎదురైందని సయామీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో వారిని ఎదిరించేంత ధైర్యం లేదని, అందుకే ఈ విషయాలను బయట పెట్టలేకపోయానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సయామీ ఖేర్ వ్యాఖ్యలు చిత్ర సీమలో సంచలనం సృష్టిస్తుండగా.. ఆమెను కమిట్మెంట్ అడిగిన దర్శకుడు ఎవరని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: saiyami kher movie news Jaat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X