Sakshi Malikk : సాక్షి మాలిక్ అందాల విందు .. స్విమ్ సూట్‌లో ఒంపు సొంపులు అదరహో
సోషల్ మీడియా రాకతో చాలా మంది బ్యూటీలు యువతలో క్రేజ్ దక్కించుకున్నారు. తమ టాలెంట్‌ను ఎలా బయట పెట్టాలో తెలియక కుమిలిపోయిన వారికి సోషల్ మీడియా ఓ ఫ్లాట్‌ఫాంలా నిలిచింది. ఈ దెబ్బకి రాత్రికి రాత్రి స్టార్స్‌గా మారినవారు ఎందరో. ఇలాంటి వారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సాక్షి మాలిక్ కూడా ఒకరు. అరేబియన్ గుర్రంలా ఉండే సాక్షి మాలిక్ తన అందాలతో కుర్రకారు నిద్రలేకుండా చేస్తోంది.
21 జనవరి 1997న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు సాక్షి మాలిక్. నోయిడాలోని జైపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. పలు మోడలింగ్, ఫ్యాషన్ షోలలో పాల్గొని మంచి గుర్తింపు దక్కించుకుంది సాక్షి మాలిక్. చదువు పూర్తి చేసిన తర్వాత తన మకాంను ముంబైకి మార్చింది ఈ బ్యూటీ.

మోడలింగ్‌లో ఉన్న కొద్దిపాటి అనుభవంతో అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో టీవీ యాడ్స్‌లో నటించింది. నైకా, పీసీ జ్యువెలరీ వంటి బ్రాండ్స్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో నటించింది. తన అందచందాలతో బాలీవుడ్ దర్శక నిర్మాతల కళ్లలో పడిన ఈ ముద్దుగుమ్మకు హిందీ సినిమాలలో అవకాశాలు వచ్చాయి. 2018లో సోను కే టిటుకి స్విటీ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇందులోని బాం డిగ్గి డిగ్గి అనే పాట మాస్‌ను ఊపేయడంతో పాటు సాక్షికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో అమ్రాన్ మాలిక్ రూపొందించిన వెహం అనే మ్యూజిక్ వీడియోలోనూ నటించి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.
అయితే నేచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వీ సినిమాలో తన అనుమతి లేకుండా తన ఫోటోను ఉపయోగించినందుకు గాను బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేయడం కలకలం రేపింది. ఇందులో ఓ ఫోన్‌లో కమర్షియల్ సెక్స్ వర్కర్ ఫోటోను మరో వ్యక్తికి చూపించే ఓ సీన్ ఉంది. అది తన ఫోటోనే అంటూ సాక్షి కోర్టుకెక్కింది. దీనిపై స్పందించిన ధర్మాసనం చిత్ర నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా వేరే వ్యక్తులను ప్రైవేట్ ఫోటోలు, వారి ఇమేజ్‌ను వాడటం చట్ట విరుద్ధమని మండిపడింది. సినిమాలోని సాక్షి మాలిక్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సీన్స్‌ను తొలగించాలని ఆదేశించింది.
అయితే గడిచిన రెండేళ్లుగా సాక్షి మాలిక్ ఏ సినిమాలోనూ, మ్యూజిక్ వీడియోలోనూ కనిపించలేదు. చివరిసారిగా 2023లో డ్రై డే అనే హిందీ సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సాక్షి మాలిక్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సాక్షి మాలిక్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అన్నింటికి మించి ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్ కావడంతో ఆమె చేసే యోగా వీడియాలకు భారీ క్రేజ్ ఉంది. తాజాగా పింక్ కలర్ స్విమ్ సూట్‌లో నది ఒడ్డున సాక్షి మాలిక్ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఆమె అందాలపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications










