అలా పవన్ కళ్యాణ్ మూవీ వదులుకున్నా.. ఆ రూమర్స్‌కి హీరోయిన్ చెక్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ, పవన కళ్యాణ్ విషయంలో మాత్రం వేరు. అతన్నీ దేవుడిగా కొలిచే భక్తులు కొంతమందే ఉంటారు. పవర్ స్టార్ క్రేజ్ అలాంటి. ఇక చాలా మంది హీరోయిన్స్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ రావాలని కోరుకుంటారు. ఆయన సరసన నటించాలని, తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని భావిస్తారు. అదే చాలా గ్రేట్ అని ఫీల్ అయిపోతుంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య (Sakshi Vaidya). తెలుగు సినీ ప్రేక్షకులకు 'ఏజెంట్', 'గాండీవధారి అర్జున' సినిమాలతో పరిచయమైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయాయి. అయినా.. సాక్షి వైద్య గ్లామర్‌, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం యువతను ఆకట్టుకుంది. అయితే వరుస ఫ్లాపుల కారణంగా ఆమె కెరీర్‌పై విమర్శలు రావడంతో పాటు, దాదాపు రెండేళ్ల పాటు తెలుగు తెరపై ఆమె కనిపించలేదు.

Sakshi Vaidya Opens Up on Missing Pawan Kalyan s Ustaad Bhagat Singh Opportunity

ఇలాంటి సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో సాక్షి వైద్యకు కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చినట్లు ప్రచారం జరిగింది. షూటింగ్‌లో కూడా ఆమె పాల్గొన్నట్లు వార్తలు రావడంతో, ఈ సినిమా సాక్షి కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనే అంచనాలు పెరిగాయి. అయితే అనుకోకుండా ఈ అవకాశం ఆమె చేతుల నుంచి జారిపోయి, ఆ పాత్రను రాశీ ఖన్నా దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది.ఈ పరిణామం తర్వాత సాక్షిని గత సినిమాలు ఫ్లాప్ కావడం వల్లనే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తప్పించారన్న రూమర్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపించాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సాక్షి వైద్య ఈ ప్రచారాలకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. 'ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నాకు నిజంగానే కీలక పాత్రలో అవకాశం వచ్చింది. వారం రోజుల పాటు షూటింగ్‌లో కూడా పాల్గొన్నాను. కానీ అదే సమయంలో నా కుటుంబంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దాంతో వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో యూనిట్ నుంచి రేపటి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని కాల్ వచ్చింది. ఆ పరిస్థితుల్లో నేను షూటింగ్‌కు వెళ్లలేకపోయాను. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతోనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది' అని సాక్షి వివరించింది.

అలాగే తనను ఫ్లాపుల కారణంగా తీసేశారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ.. 'అలాంటి రూమర్స్‌ని నేను పెద్దగా పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్లడమే నా లక్ష్యం' అని చెప్పింది. సాక్షి కామెంట్స్ తో చాలాకాలంగా చక్కర్లు కొడుతున్న పుకార్లకు తెరపడినట్లయింది. ఇప్పుడు సాక్షి వైద్య ఆశలన్నీ శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'నారీ నారీ నడుమ మురారి' పైనే ఉన్నాయి.

శర్వానంద్ సరసన నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా సంయుక్త కూడా కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ సాక్షి పాత్ర సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని తెలుస్తోంది. ఇది ఆమె మూడో తెలుగు సినిమా కావడంతో, ఎలాగైనా హిట్ కొట్టి తన కెరీర్‌ను నిలబెట్టుకోవాలని సాక్షి ప్రయత్నిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X