3000 ఏళ్ల నాటి యుద్దవిద్యలు నేర్చుకుంటున్న సలార్ బ్యూటీ.. ఎందుకో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో ఫిట్‌నెస్, డెడికేషన్, హార్డ్‌వర్క్‌కు చాలా మంది ప్రాధాన్యత ఇస్తారు. కానీ, ఒక హీరోయిన్ మాత్రం అందులోనే కాకుండా.. దాదాపు 3000 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన యుద్ధ విద్యలను నేర్చుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కర్రసాము, కత్తి యుద్ధం, కలరిపయట్టు వంటి ప్రమాదకర విన్యాసాలను సులభంగా చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతటీ కఠిన స్థాయిలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరు? ఏ సినిమా కోసం ఈ రిస్క్ తీసుకుంటోంది? అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో పెరుగుతోంది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అందాల భామ శ్రియరెడ్డి. తెలుగులో 'అప్పుడప్పుడు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతో పెద్ద హిట్ అందుకోకపోయినా, తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. అందంతో పాటు యాక్టింగ్ టాలెంట్‌తో ఆకట్టుకున్న ఆమె, తర్వాత తమిళ్, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.'అమ్మ చెప్పింది' వంటి సినిమాలో కనిపిస్తూ తనదైన ముద్ర వేసింది. పాత్ర ఏదైనా తన స్టైల్‌తో ఆకట్టుకునే ఈ నటి, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ పవర్‌ఫుల్ కంబ్యాక్ ఇచ్చింది.

Salaar Beauty Shriya Reddy Learns 3000-Year-Old Martial Art for Action Roles

ముఖ్యంగా ప్రభాస్ హీరోగా వచ్చిన 'సలార్' సినిమాలో ఆమె చేసిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఈ బ్యూటీ ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీగా మారింది. ప్రస్తుతం 'సలార్ 2' కీలక పాత్రలో కనిపించబోతుంది. సలార్' సినిమాతో పవర్‌ఫుల్ పాత్రలో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా 3000 ఏళ్ల చరిత్ర కలిగిన యుద్ధ విద్యలను సాధన చేస్తూ కనిపించడం ఆమె డెడికేషన్‌ను స్పష్టంగా చూపిస్తోంది.

శ్రియ రెడ్డి ప్రస్తుతం ప్రాచీన భారతీయ మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టు (Kalaripayattu)నేర్చుకుంటున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన యుద్ధ విద్యలలో ఒకటి. ఈ విద్యలో శరీర సమతుల్యత, వేగం, ఫోకస్, కంట్రోల్ చాలా ముఖ్యమైనవి. అలాంటి కఠినమైన సాధనను శ్రియా రెడ్డి ఎంతో క్రమశిక్షణతో చేస్తుండటం విశేషం. ముఖ్యంగా 'ఉరిమి' వంటి ప్రమాదకరమైన ఆయుధాన్ని కూడా ఆమె ఎంతో సులభంగా హ్యాండిల్ చేయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోల్లో ఆమె కర్రసాము విన్యాసాలు మరింత హైలైట్ అయ్యాయి.

ఒక వీడియోలో ఒంటి చేత్తో కర్రను గిరగిరా తిప్పుతూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించగా, మరో వీడియోలో రెండు చేతులతో రెండు కర్రలను వేగంగా తిప్పుతూ తన స్కిల్స్‌ను చూపించింది. ఈ విన్యాసాలు చూస్తుంటే నిజంగా యాక్షన్ సీన్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న ప్రొఫెషనల్ ఫైటర్‌లా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ, తన ట్రైనింగ్‌ను కొనసాగించడం ఆమె పట్టుదలను తెలియజేస్తోంది.

ఇక ఈ వీడియోలతో పాటు ఆమె పెట్టిన మెసేజ్ కూడా అందరినీ ఆలోచింపజేస్తోంది. 'మన బలాన్ని మనం మర్చిపోవడాన్నే హనుమాన్ కాంప్లెక్స్ అంటారు' అంటూ ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనలో ఉన్న శక్తిని మనమే గుర్తించలేమని, ఎవరో ఒకరు గుర్తు చేస్తేనే మన సామర్థ్యం బయటపడుతుందని ఆమె భావోద్వేగంగా చెప్పింది. ఈ సందేశం చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా మారింది. ఫిట్‌నెస్, మార్షల్ ఆర్ట్స్, డెడికేషన్ అన్ని కలిపి ఆమెను ఒక పవర్‌ఫుల్ యాక్షన్ క్వీన్‌గా నిలబెట్టేలా ఉన్నాయి. రాబోయే సినిమాల్లో ఆమె నుంచి మరింత పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Read more about: shriya reddy kalaripayattu salaar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X