కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీపై తొలిసారిగా స్పందించిన సమంత.. మిగతా హీరోయిన్స్ కూడా..

హీరోయిన్ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటిగా తనకంటూ ఎంతో ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. 15 ఏళ్ల పాటు చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. అయితే రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఆమె తల్లి కావడానికి సిద్ధమైంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న కాజల్ అగర్వాల్ తన బేబి బంప్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. అయితే రీసెంట్ గా కాజల్ అగర్వాల్ ఒక అందమైన ఫోటోలు పోస్ట్ చేయడంతో ఆ ఫోటో పై సమంతా కూడా స్పందించడం విశేషం. సమంత ఏమని స్పందించింది అనే వివరాల్లోకి వెళితే..

Recommended Video

Kajal Aggarwal Slams Body Shamers గర్భవతులకు టిప్స్..సమంత సపోర్ట్ | Filmibeat Telugu
భాషతో సంబంధం లేకుండా

భాషతో సంబంధం లేకుండా


తెలుగు తమిళ్ హిందీ కన్నడ ఇలా భాషలలో సంబంధం లేకుండా సినిమాల్లో నటించేందుకు ఆసక్తిని చూపించింది. బాక్సాఫీస్ వద్ద ఎన్నో విజయాలను అందుకున్న ఈ చందమామ దాదాపు సౌత్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. గ్లామర్ లో కూడా ఎప్పుడూ అమ్మడు మెరుస్తున్న చందమామలోనే దర్శనమిచ్చింది.

 పెళ్లి చేసుకొని న్యూ లైఫ్

పెళ్లి చేసుకొని న్యూ లైఫ్


ఇక కాజల్ అగర్వాల్ 2020లో తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బిజినెస్మేన్ గౌతమ్ కిచ్లూతో గత ఏడేళ్ల నుంచి కాజల్ అగర్వాల్ చాలా సీక్రెట్ గా తన రిలేషన్ షిప్ ను కొనసాగించింది. ఇక ఫైనల్ గా అతన్ని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ తన సినిమా కెరీర్ ను సంతోషంగా కొనసాగించింది. ఆ విషయంలో కూడా ఆమెకు భర్త నుంచి మద్దతు లభించింది.

రీసెంట్ గా కాజల్ అగర్వాల్

రీసెంట్ గా కాజల్ అగర్వాల్


ఇక రీసెంట్ గా కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కాజల్ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా ప్రత్యేకమైన పోస్టు చేసిన విషయం తెలిసిందే. తమ కుటుంబం పెద్దది కాబోతోందని కూడా అతను తెలియజేశాడు. అంతే కాకుండా కాజల్ అగర్వాల్ కూడా బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. రీసెంట్ గా నిషా అగర్వాల్ తో కూడా ఆమె ఒక ప్రత్యేకమైన యాడ్లో నటించింది. అందులో కూడా ఆమె బేబి బంప్ ను చూపించింది.

సమంత రియాక్షన్

సమంత రియాక్షన్

అయితే కాజల్ అగర్వాల్ కు సంబంధించిన ఫోటో పై సమంత కూడా ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేయడం విశేషం. రీసెంట్ గా తను ప్రెగ్నెన్సీ లైఫ్ గురించి ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేసింది. అందులో నెగిటివ్ కామెంట్ చేసే వారికి కూడా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కాజల్ ఎవరు ఏమనుకున్నా కూడా ఇలాంటి సమయంలో ఒక బిడ్డకు జన్మనిస్తూన్నాము కాబట్టి సంతోషంగా ఉండాలని ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని వివరణ ఇచ్చింది.

చాలా అందంగా ఉన్నావు..

చాలా అందంగా ఉన్నావు..

అయితే కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసిన ప్రత్యేకమైన ఫోటో పై మొదటిసారి సమంత కూడా స్పందించింది. 'నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు' అంటూ సమంత కామెంట్స్ చేసిన విధానానికి చాలా మంది నెటిజన్లు లైక్ చేశారు. కేవలం సమంత మాత్రమే కాకుండా మంచు లక్ష్మి, రాశి కన్నా, ఈశా రెబ్బా కూడా కాజల్ చేసిన కామెంట్స్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఆమె స్పంధించిన విధానానికి కూడా మద్దతు ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X