Samantha: సీక్రెట్ బయటపెట్టిన సమంత.. విడాకుల తర్వాత భవిష్యత్ ఏంటి? అంటూ!
భారతీయ సినిమా రంగంలో అగ్ర హీరోయిన్లలో ఒకరైన సమంత తనకు ఎదురైన కష్టకాలాన్ని ఎదురీగుతూ కాలాన్ని జయించే ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు, మూడు ఏళ్లుగా కాలం ఆమెకు అగ్ని పరీక్షనే పెట్టింది. వైవాహిక జీవితం అర్ధాంతరంగా ఆగిపోవడం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం లాంటి విషయాలు చూస్తే.. ఆమె తన జీవితంలో కోలుకోవడం కష్టమనే ఫీలింగ్ ఎదుటి వాళ్లకు కల్పించింది. కానీ వాటిని అన్నింటిని తట్టుకొని ప్రస్తుతం తన జీవితాన్ని గాడిన పెట్టుకొనే ప్రయత్నంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. అయితే తాజాగా తన జీవితంలో జరిగే సంఘటనలను డైరీలో రాసుకొంటూ కొన్ని సీక్రెట్‌ను బయటకు చెప్పే ప్రయత్నం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
సమంత తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం ఎప్పుడూ ఒపెన్ బుక్‌గా ఉంచుకొనేందుకు ప్రయత్నిస్తుంటుంది. సోషల్ మీడియాలో నిత్యం తన పోస్టులతో అభిమానులకు పండుగ వాతావరణం కల్పిస్తుంటారు. తన జీవితంలో జరిగే ప్రతీ విషయాన్ని పంచుకొనేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే తన విడాకుల తర్వాత తాను అనుసరిస్తున్న అలవాటు గురించి తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకొంటూ..

గత రెండేళ్లుగా ఈ అలవాటును కొనసాగిస్తున్నాను. నా జీవితంలో కొన్ని కఠినమైన క్షణాలు నన్ను ఇలా మార్చేశాయి. ఈ అలవాటు చాలా సులభమైంది. కానీ పవర్‌ఫుల్. ప్రస్తుతం నా జీవితం ఎక్కడుంది? నేను ఎక్కడున్నాను. నా భవిష్యత్ ఏమిటి? విషయాలు తెలుసుకొనేందుకు చేసిన ప్రయత్నాన్ని నాకు నేను అప్రిషియేట్ చేసుకొంటున్నాను. ఇలాంటి వినడానికి కొంత వింతగా ఉంటాయి. కానీ అలాంటి వింత విషయాలు ఏమీ లేదు. నేను వేసుకొనే ప్లాన్స్ నాకు హెల్ప్‌గా ఉంటుందని డేటా ప్రూవ్ చేసింది అని సమంత రుత్ ప్రభు తన పోస్టులో పేర్కొన్నారు.
సహజంగానే మీకు రాయడం వస్తే.. అలాంటి అలవాటు ఉంటే.. నీ జీవితంలో సాధించిన ఘన కార్యాలను మూడు మాటల్లో రాసుకొని చూడండి. మీ జీవితానికి దోహదపడిన పెద్ద విషయాలు కాకపోవచ్చు. కానీ అవి నిజాయితీగా ఉండాలి. అలా రాయడం మీకు కష్టం లేదా ఒత్తిడిగా ఉంటే ఫర్వాలేదు. మీరు బలంగా నమ్మే వ్యక్తికి షేర్ చేయమని మీ మనసుకు చెప్పడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా కూర్చొని మీ మనసులో థ్యాంక్యూ చెప్పుకొన్నా సరిపోతుంది అని సమంత తన పోస్టులో వెల్లడించారు.

ఇలాంటి చిన్న ప్రయత్నం ఆరంభంలో చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ మీరు మిమ్మల్ని చూసుకొనే విధానాన్ని పూర్తిగా మార్చి వేసే పవర్‌ఫుల్ వెపన్‌గా మారుతుంది. మీ మనసులోని భావాలు, ఆలోచనలు రాయడం ఓ సారి ప్రయత్నించండి. అది మీ జీవితానికి గేమ్ ఛేంజర్ అవుతుంది అని సమంత చెప్పారు. మీ జీవితంలో ఈ రోజు ఎలా గొప్పగా ముగిసిందో నాకు ఓ సారి చెప్పేందుకు ప్రయత్నించండి అంటూ తన అభిమానులకు సలహా ఇచ్చారు.
సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో యశోద సినిమాతో విజయం సాధించారు. ఆ తర్వాత శాకుంతలం సినిమాతో డిజాస్టర్ అందుకొన్నారు. అనంతరం వచ్చిన ఖుషి సినిమా కూడా అంతంత మాత్రంగానే నడిచింది. ఇటీవల సిటాడెల్: హానీ బన్నీ వెబ్ సిరీస్‌తో మెప్పించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌డమ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











