దిల్ రాజు పెడుతున్న బడ్జెట్ నా రేంజ్‌ను మించేలా ఉంది.. పాన్ ఇండియా సినిమాపై సమంత కామెంట్

రుద్రమదేవి లాంటి బిగ్గెస్ట్ హిస్టారికల్ సినిమా అనంతరం దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా శాకుంతలం. పిరియాడిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత టైటిల్ లో రోల్ లో నటించనుంది. మొత్తానికి నేడు సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటోంది. ఇక సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలల అనంతరం సమంత కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

శాకుంతలగా సమంత అక్కినేని.. గుణశేఖర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)

ఆదిపర్వంలోని కథతో..

ఆదిపర్వంలోని కథతో..

ఒక్కడు, చూడాలని ఉంది వంటి బాక్సాఫీస్ హిట్స్ తో అప్పట్లో ట్రెండ్ సెట్ చేరిన గుణశేఖర్‌ రుద్రమదేవి అనంతరం తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం 'శాకుంతలం'. మహాభారతం ఆదిపర్వంలోని శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శాకుంతలం పాత్రలో సమంత నటిస్తుండగా దుష్యంత పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు.

సినిమా కోసం భారీ సెట్స్

సినిమా కోసం భారీ సెట్స్

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నారు. గుణశేఖర్ కూతురు నీలిమతో పాటు దిల్ రాజు కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాను నేడు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. సినిమా కోసం దర్శకుడు గుణశేఖర్ భారీ సెట్స్ ను డిజైన్ చేయిస్తున్నారు. ఇక రెగ్యులర్ షూటింగ్ ను మార్చ్ 20న స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పారు.

మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)

2022లో సినిమా రిలీజ్

2022లో సినిమా రిలీజ్

ఇక ఈ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన దిల్ రాజు.. గుణశేఖర్ లాంటి దర్శకుడికి ఎవరైనా సపోర్ట్ ఉంటే ఇంకా బావుంటుంది అని అనుకున్నాను. అందుకే ఈ సినిమా కోసం ముందుకు వచ్చాను. సమంత స్టోరీ గురించి చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక్కడు సినిమా చూసినప్పుడు అలాంటి ఒక సినిమాను నిర్మించాలని అనుకున్నాను.

కానీ కుదరలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు అలాంటి దర్శకుడితో వర్క్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాను హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. ఎమోషనల్ సీన్స్ చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయ్యాను. ఇక 2022లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం.. అంటూ దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.

శశి ప్రీరిలీజ్ ఈవెంట్: రానా దగ్గుబాటి, నాగ శౌర్య , సందీప్ కిషన్ హాజరు (ఫొటోలు)

బడ్జెట్ నా రేంజ్ కంటే ఎక్కువే..

బడ్జెట్ నా రేంజ్ కంటే ఎక్కువే..

సమంత మాట్లాడుతూ.. నాకు ఒక బాధ ఉండేది. రొమాంటిక్, సీరియస్, ఫన్ క్యారెక్టర్లు ఎన్నో చేశాను. కానీ పిరియాడిక్ లాంటి కథల్లో నటించలేదు. ఆ విషయంలో బాధగా ఉండేది. ఇక ఇప్పుడు అలాంటి ఆఫర్ రావడం హ్యాపీగా ఉంది. వంద శాతం నేను న్యాయం చేయడానికి కష్టపడతాను. దిల్ రాజు పెడుతున్న బడ్జెట్ అయితే నా రేంజ్ ను మించేలా ఉంది.. అంటూ సమంత వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X