నన్నెంతో మార్చింది.. ‘జాను’ బాక్సాఫీస్ రిజల్ట్స్‌పై సమంత కామెంట్స్
సౌత్ ఇండియా సూపర్ స్టార్ హీరోయిన్‌గా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతోంది సమంత. నేటికి నటిగా సమంతకు పదేళ్లు నిండటంతో సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సామాన్య జనం నుంచి సెలెబ్రిటీల వరకు అందతూ సమంతను ఆకాశానికెత్తేస్తున్నారు. కామన్ డీపీలతో సోషల్ మీడియాలో సామ్ జోరుగా మామూలుగా లేదు. నెటిజన్ల ప్రేమకు సమంత ఉబ్బితబ్బిబ్బైపోతోంది.
ఏమాయ చేశావే చిత్రం వచ్చి పదేళ్లు గడవడం, ఈ దశాబ్దంలో సమంత సాధించిన విజయాలు.. చూసిన ఎత్తుపల్లాలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. పెళ్లాయాక కూడా సమంత స్టార్ హీరోయిన్‌గా కొనసాగడటం.. పెళ్లి తరువాతే సౌత్ ఇండియన్ స్టార్‌గా మారడంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జాను చిత్రంపై, బాక్సాఫీస్ కలెక్షన్లపైనా కామెంట్ చేసింది.

బాక్సాఫీస్ లెక్కలను పక్కన బెడితే జాను చిత్రం నన్నెంతో మార్చింది.. ఈ చిత్రం ద్వారా నేనెంతో నేర్చుకున్నాను.. ఈ లెక్కన జాను చిత్రానికి నేనెప్పుడు గర్వంగా ఫీలవుతానంటూ ట్వీట్ చేసింది. పెళ్లాయక కూడా సూపర్ స్టార్‌గా కొనసాగుతున్నందుకు, సమాజం చేసే కామెంట్లను ఎదుర్కొంటూ నిలబడ్డ సమంత ఎందరికో స్ఫూర్తి అంటూ చిన్మయి ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











