twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ కూతురుకు ఏం చెబుతావ్?.... దిమ్మదిరిగే సమాధానమిచ్చిన సమంత!

    |

    సౌత్ టాప్ హీరోయిన్ సమంత #మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తూ ముందుకు రావడం హాట్ టాపిక్ అయింది. తమిళ సినీ రచయిత వైరముత్తు ద్వారా తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు సింగర్ చిన్మయి వెల్లడించిన అనంతరం ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవడంతో పాటు, తాను కూడా #మీటూ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నట్లు సమంత ప్రకటించారు.

    పబ్లిసిటీ కోసం హద్దులు దాటొద్దు, కొంతమంది కావాలనే.. మీటూపై అనసూయ మాట!పబ్లిసిటీ కోసం హద్దులు దాటొద్దు, కొంతమంది కావాలనే.. మీటూపై అనసూయ మాట!

    కాగా... ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేసిన సమంతకు #మీటూ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే కొందరు #మీటూ ఉద్యమాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేయడంతో వారికి దమ్మదిరిగే సమాధానాలు ఇచ్చింది ఈ అక్కినేని కోడలు.

    మా భయం కూడా అదే

    పదమూడేళ్ల తర్వాత ఈ విషయం బయట పెట్టారు. ఇప్పుడు బయట పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఇంత లేటుగా ఆరోపణలు చేయడం యాక్సెప్ట్ చేయబోము అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా... ‘మా భయం కూడా అదే. మీలాంటి వారు మమ్మల్ని తప్పుబట్టకూడదనే ఇలా చేస్తున్నాం' అని సమంత సమాధానం ఇచ్చారు.

    దిమ్మ దిరిగే సమాధానమిచ్చిన సమానం ఇచ్చిన సమంత

    మరొక వ్యక్తి స్పందిస్తూ... ‘‘ఈరోజు మా అబ్బాయి నన్ను అసలు ‘మీ టూ' అంటే ఏంటి?' అని అడిగాడు. అప్పుడు నేను ‘మీటూ అంటే ఆడవారి రిటైర్మెంట్‌ బీమా పథకం' అని చెప్పాను. అప్పుడు మా అబ్బాయి ‘అదెలా?' అని మళ్లీ ప్రశ్నించాడు. అపేడు నేను ‘ఆడవాళ్లు అన్ని విషయాల్లో తలదూరుస్తారు. కెరీర్‌ ముగిశాక ఈ బీమాను వాడుకుంటారు. అప్పుడు వాళ్ల గురించి బర్కా దత్, అర్నాబ్ లాంటి వారు కవర్ చేస్తారు.'' అని చెప్పా. ఇది విని మా అబ్బాయి ‘దేవుడా ఈ దేశాన్ని బాగు చేయి' అని అన్నాడు'' అంటూ వ్యాఖ్యనించారు. దీనికి సమంత రియాక్ట్ అవుతూ ‘అదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చెబుతావ్?' అని ఘాటుగా దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు.

    అందుకే మద్దతు ఇస్తున్నాను

    #మీటూ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి కారణం మహిళా శక్తి బలమైనది అని నిరూపించడానికే అని సమంత తెలిపారు.

    జూనియర్ ఆర్టిస్టులకు కూడా మద్దతుగా ఉంటా

    చిన్మయికి మద్దతుగా చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. వారికంటే ఇండస్ట్రీలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న జూనియర్ ఆర్టిస్టులకు కూడా మీ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా... తప్పకుండా ఇస్తాను అని సమంత తెలిపారు.

    English summary
    Samantha about Me Too Movement and Chinmayi. Samantha and Varalaxmi Sarathkumar are the only ones from Kollywood to break their silence about Me Too after Chinmayi tweeted on Vairamuthu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X