రావు రమేష్ నా బిడ్డ అంటే.. కళ్లలో నీళ్లు తిరిగాయి.. సమంత
టాలీవుడ్ హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత కెరీర్ తారాజువ్వలా దూసుకెళ్తున్నది. అభిమన్యుడు, రంగస్థలం, సూపర్ డీలక్స్, యూటర్న్ లాంటి సినిమాలు ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. తాజాగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రతో ఓ బేబీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా జూలై 5వ తేదీన విడుదల అవుతున్న సందర్భంగా సమంత మీడియాతో ముచ్చటించారు. ఓ బేబీ సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఆమె ఏమన్నారంటే..
ఓ బేబీ సినిమాలో రావు రమేష్ కాంబినేషన్‌తో చేసిన సీన్ అత్యంత కష్టమైంది. అతడిని నా బిడ్డ అని ఊహించుకోవడానికే కష్టమైంది. నా కడుపులో పుట్టి 50 ఏళ్ల వ్యక్తి నా కుమారుడని నమ్మకం కలుగడానికి చాలా సేపు పట్టింది. నందినీరెడ్డి రెండు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ సీన్‌లోకి ప్రవేశించడానికి ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ సమయం తీసుకొన్నాను. నా బిడ్డ అనే విషయం కంటే.. నేను తల్లి అనే విషయాన్ని జీర్ణించుకోవడానికి కష్టమైంది. ఆ సీన్ బాగా చేయాలని ముందు నుంచి మైండ్ మేకప్ చేసుకొన్నాను. కానీ ఏదో మైండ్ బ్లాక్ అయింది.

ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సాధారణంగా ఎమోషనల్ సీన్లలో కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అలాంటిది రావు రమేష్‌తో సీన్‌లో నటించడానికి చాలా కష్టపడ్డాను. సీన్‌లో అలాంటి భావోద్వేగం ఉంటుంది. సినిమా చూస్తే ఆ సీన్ ఎంత కష్టమో మీకే తెలుస్తుంది అని సమంత పేర్కొన్నారు.
ఓ బేబీ తర్వాత నేను పూర్తిస్తాయి (కంప్లీట్) యాక్టర్ అయ్యానని అనుకోను. నేనెప్పుడూ అలా ఫీల్ కాను. ఇంతకు ముందు నటించిన సినిమాలను నేను అప్పుడే మరిచిపోతాను. కాబట్టి నేను గొప్ప నటినా అని బేరీజు, లెక్కలు వేసుకొను. నేను ఎప్పుడూ కంప్లీట్ యాక్టర్ అని అనుకోను. ప్రతీ రోజు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకొంటాను. నేను నిత్య విద్యార్థిని అని సమంత పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











