అప్పుడు సినిమాను పొగిడి, ఇపుడు దర్శకుడిని తిట్టి... వివాదంలో సమంత!
Recommended Video
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన 'అర్జున్ రెడ్డి' చిత్రం 2017లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఇదే చిత్రం ఇపుడు మళ్లీ సందీప్ వంగా దర్శకత్వంలోనే హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ అయి ఘన విజయ అందుకుంది.
'కబీర్ సింగ్'కేవలం 13 రోజుల్లోనే రూ. 200 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ 'భారత్' చిత్రాన్ని సైతం ఈ మూవీ వసూళ్ల పరంగా వెనక్కి నెట్టి వేసింది. అయితే కబీర్ సింగ్ చిత్రానికి మాత్రం క్రిటిక్స్ నుంచి విమర్శలే ఎదురయ్యాయి.

‘కబీర్ సింగ్' వివాదంలో సమంత
‘కబీర్ సింగ్' మూవీలో హీరో హీరోయిన్‌ను హీరో కొట్టిన సన్నివేశాలపై వివాదం రాజుకుంది. దీనిపై సందీప్ రెడ్డి స్పందిస్తూ... ‘ప్రేమలో ఉన్న ఇద్దరికి ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్ఛ లేనపుడు... వారిలో నిజమైన ప్రేమ లేనట్లే' అంటూ వ్యాఖ్యానించారు. అయితే సందీప్ రెడ్డి కామెంట్స్ తనను బాధించాయి అంటూ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పేర్కొన్నారు.

సమంత డబల్ స్టాండర్డ్స్ అంటూ...
2017లో ‘అర్జున్ రెడ్డి' సినిమా విడుదలైనపుడు ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటూ పొగడ్తలు గుప్పించిన సమంత.....ఇపుడు ‘కబీర్ సింగ్' చిత్రంలో సీన్లపై విమర్శలు చేయడంతో కొందరు సమంత డబల్ స్టాండర్డ్స్, రెండు నాల్కల ధోరణి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకం అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు.

స్పందించిన సమంత
ఈ అంశంలో తనపై వస్తున్న విమర్శలపై సమంత స్పందించారు. ‘ఒక సినిమాను ఇష్ట పడటం... ఒకరి కామెంటుతో విబేధించడం రెండు భిన్నమైనవి. నాకు ‘అర్జున్ రెడ్డి' కథ బాగా నచ్చింది. ప్రేమించడం అంటే వారిని కొట్టే హక్కు కూడా ఉంది అని జనరలైజ్ చేయడం తగదు' అని స్పష్టం చేశారు.

సమంత ఓ బేబీ
ఈ వివాదం సంగతి పక్కన పెడితే..... ప్రస్తుతం అటు హిందీలో సందీప్ వంగా మూవీ ‘కబీర్ సింగ్' బాక్సాఫీసును రూల్ చేస్తుండగా, ఇటు తెలుగులో సమంత ‘ఓ బేబీ' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ రెండు సినిమాల గురించి చర్చే సాగుతోంది.


Click it and Unblock the Notifications











