లేడీ డైరెక్టర్‌ అయితేంటీ.. టాలెంటే ముఖ్యం.. సమంత అసహనం

గతేడాది అభిమన్యుడు, రంగస్థలం, మహానటి, యూటర్న్ లాంటి సినిమాలతో సమంత అక్కినేని అదరగొట్టింది. 2019లో మజిలీ సూపర్ డీలక్స్‌తో శుభారంభం చేసింది. తాజాగా ఓ బేబీ అనే విభిన్నమైన చిత్రంతో వస్తున్నారు. పలు చిత్రాల్లో విలక్షణమైన నటన ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. స్టార్ హీరోయిన్‌గా మార్చడమే కాకుండా.. హీరో స్థాయికి తగినట్టు భారీ కటౌట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓ బేబీ సినిమా జూలై 5వ తేదీన విడుదలైంది. ఈ సందర్భంగా సమంత మీడియాతో ముచ్చటించారు. ఓ బేబీ సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

Samantha Akkineni about Nandini Reddy in Oh! Baby promotion

లేడీ డైరెక్టర్‌తో చేయడం ఎలాంటి కంఫర్ట్ ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ.. లేడీ డైరెక్టర్, మేల్ డైరెక్టర్ అనే తేడా నాకు లేదు. ఎవరితోనైనా కంఫర్ట్‌గా ఉంటాను. టాలెంట్ అనేదే నేను చూస్తాను. నందినీ రెడ్డి నాకు డియర్ ఫ్రెండ్. నాతో ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు. పుష్కలంగా ప్రతిభ ఉన్న డైరెక్టర్. మహిళా, పరుష డైరెక్టర్ల వల్ల వర్కవుట్ కాదు. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ నిలబెడుతున్నది. ఓ బేబి సినిమాకు ఎక్కువ మంది మహిళా టెక్నిషియన్స్ పనిచేశారు అని సమంత పేర్కొన్నారు.

అంతేకాకుండా నందినీ రెడ్డి నాకు డియర్ ఫ్రెండ్. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి అని సమంత పేర్కొన్నారు. కేవలం మహిళ అనే ట్యాగ్‌తో వారు అవకాశం దక్కించుకోలేదు. వారి ప్రతిభ కారణంగానే వారు సినిమాకు వర్క్ చేశారు అని అన్నారు.

ఓ బేబీ తర్వాత నేను పూర్తిస్తాయి (కంప్లీట్) యాక్టర్ అయ్యానని అనుకోను. నేనెప్పుడూ అలా ఫీల్ కాను. ఇంతకు ముందు నటించిన సినిమాలను నేను అప్పుడే మరిచిపోతాను. కాబట్టి నేను గొప్ప నటినా అని బేరీజు, లెక్కలు వేసుకొను. నేను ఎప్పుడూ కంప్లీట్ యాక్టర్ అని అనుకోను. ప్రతీ రోజు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకొంటాను. నేను నిత్య విద్యార్థిని అని సమంత పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X