Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ పాత్రకు పనికి రాదు.. తీసుకొంటే కష్టమేనని చెప్పారట.. సీక్రెట్ లీక్ చేసిన సమంత
గత మూడు, నాలుగు సంవత్సరాలుగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో సమంత అక్కినేని వరుస విజయాలను తన ఖాతాలో వేసుకొంటున్నారు. సక్సెస్‌లతో జైత్ర యాత్రను కొనసాగిస్తూ అగ్రతారగా కొనసాగుతున్నారు. తాజాగా హోస్ట్‌గా కూడా అద్భుతంగా బుల్లితెరపై రాణిస్తున్నారు. అయితే తనకు బాగా పేరు తెచ్చిపెట్టిన రామలక్ష్మీ పాత్ర గురించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ...
బుల్లితెర మీద హోస్ట్‌గా
వెండితెర మీద స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమంత ఇప్పుడు బుల్లితెర మీద ఫోకస్ పెట్టారు. బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్లో అనుకోని అవకాశాన్ని చేజిక్కించుకొన్న ఈ బ్యూటీ హోస్ట్‌గా అదరగొట్టారు. ఆ తర్వాత ప్రస్తుతం ఆహా ఓటీటీ యాప్‌లో సామ్ జామ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు.
సామ్ జామ్‌లో రకుల్, క్రిష్ జాగర్లమూడి
తాజాగా తన సామ్ జామ్ కార్యక్రమంలో రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో మాట ముచ్చట కొనసాగించారు. వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఓ గ్రామీణ నేపథ్య చిత్రంపై మాట్లాడుకొంటుంండగా రంగస్థలం సినిమా గురించి చర్చ జరిగింది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ పల్టెటూరి పిల్లగా గ్లామర్ ఆస్కారం లేని పాత్రలో కనిపించబోతున్నారు.
ఇమేజ్‌కు దూరంగా ఉండే పాత్రలో
రకుల్ ప్రీత్ సింగ్ అంటే గ్లామర్ తారగా పేరుంది. కొండ పొలం అనే పుస్తకం చదివిన తర్వాత రకుల్ ప్రీత్‌తో పల్లెటూరి యువతి పాత్రను చేయించాలని అనుకొన్నాను. ఆమెను కథను చెప్పగా చేయడానికి ముందుకొచ్చారు. తన ఇమేజ్ను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. కానీ రకుల్‌ను గ్లామర్‌కు దూరంగా ఉండే పాత్రను ప్రేక్షకులు ఒప్పుకొంటారా అనే సందేహం ఇంకా వెంటాడుతూనే ఉంది అంటూ క్రిష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
రామలక్ష్మి పాత్ర గురించి
అయితే క్రిష్ సందేహాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చూస్తూ.. రంగస్థలం చిత్రంలో రామలక్ష్మీ పాత్రకు మొదట నన్ను అనుకొన్నప్పుడు.. అసిస్టెంట్ డైరెక్టర్లు సమంత అయితే వద్దు అని చెప్పారట. ఆమె గ్లామర్ హీరోయిన్, ప్రేక్షకులు ఒప్పుకొంటారో లేదో తెలియదు. రామలక్ష్మి పాత్రకు సమంత సరిపోతుందో లేదో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు అని సమంత తెలిపారు.
సుకుమార్ ఆఫర్‌తో
రామలక్ష్మి పాత్ర చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైటింగ్ అయ్యాను. సుకుమార్ ఇచ్చిన ఆఫర్ నాకు ఛాలెంజిగ్‌గా అనిపించింది. సినిమా రిలీజ్ తర్వాత నాకు వచ్చిన రెస్పాన్స్ అద్బుతంగా అనిపించింది. కెరీర్లో అలాంటి పాత్రలు చేయడం వల్ల కొత్త అనుభూతిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అని సమంత తెలిపారు.