For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాకు ఎన్నో అనుమానాలు.. ఆ విషయంలో చైతును విసిగించాను.. ఆ భయం వెంటాడింది: సమంత

|

దక్షిణాదిలో టాప్ హీరోయిన్ ఎవరంటే ఎలాంటి సందేహం లేకుండా ఠక్కున చెప్పే పేరు సమంత అక్కినేని. పెళ్లి తర్వాత కూడా వెండి తెర మీద తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొడుతున్నది. ఈ ఏడాది ఆరంభంలోనే రెండు బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకొన్నది. తమిళంలో విడుదలైన సూపర్ డీలక్స్, తెలుగులో వచ్చిన మజిలీ ఘన విజయాలు అందుకొన్నాయి. ఇలా సక్సెస్ పట్టాలపై దూసుకెళ్తున్న సమంత ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తన అనుభవాలను పంచుకొన్నారు. సమంత చెప్పిన విషయాలు ఏమిటంటే..

 సినిమాల ఎంపిక విషయంలో

సినిమాల ఎంపిక విషయంలో

నా సినిమాల ఎంపిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దర్శకుడు కథ చెప్పినపుడు అంతా మంచిగానే అనిపిస్తుంది. కథ ఒప్పుకొన్న తర్వాత ఇక నాలో గందరగోళం మొదలవుతుంది. సినిమా షూటింగ్ సమయంలో అనేక అనుమానాలు వెంటాడుతుంటాయి. ఎడిటింగ్ టేబుల్ మీదకు వచ్చే సరికి గందరగోళం మరింత ఎక్కువ అవుతుంది అని సమంత అన్నారు.

మజిలీ రిలీజ్‌కు ముందు నా పరిస్థితి

మజిలీ రిలీజ్‌కు ముందు నా పరిస్థితి

మజిలీ సినిమా విడుదల ముందు నేను పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. నేను అనుభవించిన ఒత్తిడి మాటల్లో చెప్పలేను. ఈ స్టోరీ ఎంపిక చేసుకొన్నది నేనేనా అనే డౌట్ మొదలవుతుంది. ఈ సినిమా ఆడుతుందా లేదా అనే భయం వెంటాడుతుంది. నేను నటించిన సినిమాలకు ముందు.. ఈ సినిమా గ్యారంటీగా హిట్టవుతుందని ఏనాడు అనుకోలేదు. ప్రతీసారి ప్లాఫ్ భయం వెంటాడుతూనే ఉంటుంది అని సమంత తెలిపారు.

నన్ను ఆ భయం వెంటాడింది

నన్ను ఆ భయం వెంటాడింది

మజిలీ సినిమా విషయంలో ఆ భయం ఎక్కువగా అనుభవించాను. చైతూ, నేను కలిసి నటించిన సినిమా ఫ్లాప్‌ అయిపోతుందేమో అని తెగ భయపడ్డాను. చాలాసార్లు చైతూను విసిగించాను. సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన ఫీడ్‌బ్యాక్ తర్వాత ఆ భయం పోయింది. నా జీవితంలో నేను బాగా భయపడిన సినిమాలు బాగా ఆడాయి. సినిమా ఆడుతుందా లేదా అనే విషయంలో నా జడ్జిమెంట్‌ చాలా చెత్తగా ఉంటుంది. అని సమంత వెల్లడించారు.

ఇతర హీరో, హీరోయిన్ల సినిమాల గురించి

ఇతర హీరో, హీరోయిన్ల సినిమాల గురించి

నా సినిమాలు తప్ప మిగిలిన హీరోలు, హీరోయిన్లు నటించిన చిత్రాల ఫలితాలు బాగానే ఊహిస్తాను. నేను నటించిన సినిమాపై నాకున్న ప్రేమ అలాంటి భయం వస్తుందని అనుకొంటాను అని సమంత పేర్కొన్నారు. గతేడాది సమంత నటించిన రంగస్థలం, అభిమన్యుడు, మహానటి, యూటర్న్, ఈ ఏడాది సూపర్ డీలక్స్, మజిలీ చిత్రాలు ఘన విజయం సాధించాయి. గత ఏడాది కాలంగా సమంత బ్లాక్‌బస్టర్ హిట్లతో జోరు కొనసాగిస్తున్నది.

English summary
Samantha Akkineni continue success josh in South film Industry. Her movie super Deluxe and Majili become huge hit. In this occassion, She speaks about her selection of movies and apprehensions before movie release.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more