For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో బిగ్ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. శాకుంతలం తరువాత అదే?

  |

  గ్లామరస్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కూడా భిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఒక విధంగా సినిమాలతో కంటే కూడా ఘాటైన ఫోటోషూట్స్ తో ఎక్కువగా క్రేజ్ అందుకుంటోంది. సోషల్ మీడియాలో రోజు రోజుకి ఫాలోవర్స్ సంఖ్యను కూడా గట్టిగానే పెంచుకుంటుంది. సినిమాలు చేస్తున్న చేయకపోయినా కూడా ఏదో ఒక ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది. గత కొంత కాలంగా సమంత ఎంచుకుంటున్న కథలు కూడా చాలా విభిన్నంగా ఉంటున్నాయి. ఆమె రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పూర్తిగా రిజెక్ట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

  సమంత సినిమాలో ఉంది అంటే ఆ పాత్ర ఎంతో కొంత భిన్నంగా ఉండాలి అనే విధంగా కథలను సెలక్ట్ చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఇక చివరిగా 2019లో ఓ బేబి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్ గా బాక్సాఫీస్ హిట్ అందుకుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక తర్వాత హోస్ట్ గా కూడా సమంత మంచి క్రేజ్ అందుకుంటూ వచ్చింది. గత ఏడాది మొదట్లో వచ్చిన జాను సినిమా బాగానే హైప్ క్రియేట్ చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇక సమంత తన తదుపరి సినిమాను గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

  Pavani Ash: అదిరే అందాలతో కవ్విస్తున్న బుల్లితెర బ్యూటీ ..వీపు అందాలతో విరహపు వల!

  Samantha akkineni another big budget lady oriented movie update

  ప్రతిష్టాత్మక పౌరాణిక కథ, శకుంతలంలో టైటిల్ రోల్ లో కనిపించనుంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో శకుంతల పాత్రను సామ్ పోషిస్తోంది. ఇప్పుడు, తాజా కథనాల ప్రకారం సమంత మరో లేడి ఓరియెంటెడ్ చిత్రం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక టాక్ అయితే వస్తోంది. నాని జెంటిల్‌మన్, సుధీర్ బాబు సమ్మోహనం వంటి ప్రాజెక్టులను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఇటీవల సమంతకు ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పినట్లు సమాచారం. ఒక సీనియర్ దర్శకుడి వద్ద సహాయక దర్శకుడిగా వర్క్ చేసినటువంటి యువ దర్శకుడు రాసిన స్క్రిప్ట్‌తో సమంతను సంప్రదించారట. సామ్ కూడా అతను చెప్పిన స్క్రిప్ట్ అలాగే ప్రాజెక్ట్ ను డిజైన్ చేసిన విధానం ఎంతగానో ఇష్టపడ్డారట.

  Anchor Manjusha: ఉల్లిపోర లాంటి డ్రెస్‌తో అందాల విందు.. గ్లామర్ ట్రీట్‌లో ఎక్కడ తగ్గట్లేదుగా!

  పాత్ర కూడా కొత్తగా అనిపించడంతో పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. అయితే క్లైమాక్స్ విషయంలో కొంత చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ పనులు పూర్తయితే నవంబర్ నుండి సమంత తన డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టుపై సమంత అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సమంత తమిళంలో కూడా నయనతార తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే సమంతకు ఇటీవల బాలీవుడ్ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నట్లు ఒక టాక్ అయితే వచ్చింది. అందుకే ఆమె ముంబైకి వెళ్లాలని నిర్ణయం కూడా తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. మరి ఆ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

  English summary
  Samantha akkineni another big budget lady oriented movie update.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X