సమంతకు మరో ఓటీటీ సంస్థ నుంచి వెబ్ సిరీస్ ఆఫర్.. ఈసారి అంతకుమించి అనేలా..
ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 సక్సెస్ తో ఒక్కసారిగా మళ్ళీ ఓటీటీ కంపెనీకలకు ధైర్యం కలిగింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఆ వెబ్ సిరీస్ ఊహించని రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా అందులో బోల్డ్ పాత్రలో నటించిన సమంతకు మంచి గుర్తింపు దక్కింది. ఆమె చూపించిన హావభావాలు కథకు ప్రాణం పోశాయి. కెరీర్ లో మొదటిసారి సమంత తన గ్లామర్ ను పూర్తిగా పక్కన పెట్టి నటించింది.
ఇక సమంతకు మరికొన్ని బడా ఓటీటీ సంస్థల నుంచి కూడా ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. సమంత కంటే ముందు కాజల్ అగర్వాల్, తమన్నా వెబ్ సిరీస్ లలో నటించారు. కానీ వారు చేసిన ప్రయోగాలు అంతగా క్లిక్కవ్వలేదు. ఇక సమంత చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఇటీవల నెట్ ఫ్లిక్స్ నుంచి కూడా ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

అమెజాన్ ప్రైమ్ నుంచి ఇప్పటికే రెండు ఆఫర్స్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. ఇక నెట్ ఫ్లిక్స్ నుంచి కూడా సమంతకు ఆఫర్స్ వస్తున్నట్లు టాక్ వస్తోంది. మెయిన్ లీడ్ లో నటించే అవకాశం ఇస్తున్నారట. అయితే సమంత ఇంకా ఎలాంటి సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం సెకండ్ వేవ్ వలన ఇంటికే పతిమితమైన సమంత వచ్చిన ఆఫర్స్ గురించి జాగ్రత్తగా ఆలోచిస్తోందట. నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తోందట. ఇక నెట్ ఫ్లిక్స్ ఆఫర్ పై కూడా ఆలోచనలో పడ్డట్లు సమాచారం. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2కు దాదాపు 4కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్ వస్తోంది. ఇక నెట్ ఫ్లిక్స్ అంతకంటే ఎక్కువ రేంజ్ లో ఆఫర్ చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











