ప్రారంభమైన సమంత క్రేజీ మూవీ!
వివాహం తరువాత సమంత సినిమాలో అద్భుతమైన పాత్రలో నటిస్తోంది. ఆమె ఎంచుకుంటున్న పత్రాలు ఛాలెంజింగ్ గా ఉంటున్నాయి. రంగస్థలం చిత్రంలో రామలక్ష్మిగా, మహానటిలో మధురవాణిగా అద్భుతమైన నటన కనబరిచింది. ఇక యూటర్న్ లాంటి లేడి ఓరియెంటెడ్ చిత్రంలో నటించి మెప్పించింది. తాజాగా సమంత మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రారంభించింది.
నందిని రెడ్డి దర్శత్వంలో సమంత నటించేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఛాలెంజింగ్ రోల్ లో నటించనుండడం చాలా ఆసక్తి కలిగిస్తోందని సమంత తెలిపింది. ఈ చిత్రంలో సమంత వృద్ధురాలి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పాత్రల్లో నటించాలంటే చాలా ధైరం ఉండాలని కూడా పేర్కొంది.

సమంత ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. చైతు సరసన మజిలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రియల్ లైఫ్ కపుల్స్ రీల్ లైఫ్ కపుల్స్ గా నటిస్తున్నారు. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. మొత్తంగా సమంత వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది.


Click it and Unblock the Notifications











