Happy Birthday Samantha: ఇండియాలోనే ఫస్ట్ హీరోయిన్‌గా రికార్డు.. అందులో తెలుగు హీరోలంతా ఆమె వెనకే!

'ఏమాయ చేశావే' సినిమాతో మాయ చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది గ్లామరస్ బ్యూటీ సమంత. తొలినాళ్లలోనే భారీ విజయాలను అందుకున్న ఆమె.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇలా తెలుగులో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత మరింత ఫామ్‌తో దూసుకుపోతోంది. ఈ సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో రికార్డులు, మైలురాళ్లను చేరుకుంది. ఈరోజు సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి స్పెషల్ స్టోరీ మీకోసం!

Recommended Video

#HappyBirthdaySamanthaAkkineni : Samantha Birthday Special Story | Filmibeat Telugu
మొదటి మూవీతోనే అవార్డులు సొంతం

మొదటి మూవీతోనే అవార్డులు సొంతం

గౌతమ్ మీనన్ తెరకెక్కించిన 'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది సమంత. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. తద్వారా ఎన్నో అవార్డులు దక్కాయి. అంతేకాదు, అప్పట్లో అక్కినేని నాగేశ్వర్రావే ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. హీరోయిన్‌గా మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. అదే ఇప్పుడు నిజం అయింది.

అందరు హీరోలతోనూ.. వాళ్లతో ఎక్కువ

అందరు హీరోలతోనూ.. వాళ్లతో ఎక్కువ

టాలీవుడ్‌లో ఉన్న స్టార్లు అందరితోనూ సమంత సినిమాలు చేసింది. అందులో నాగ చైతన్యతో నాలుగు, జూనియర్ ఎన్టీఆర్‌తో నాలుగు సినిమాలు చేసింది. మిగిలిన స్టార్లతోనూ ఒక్కటి రెండు చిత్రాలు చేసింది. తద్వారా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా అందుకుంది. ఇలా దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోందీ అందాల సుందరాంగి.

అక్కడ కూడా సత్తా.. వరుస విజయాలే

అక్కడ కూడా సత్తా.. వరుస విజయాలే

తెలుగులో తన హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న సమంత.. తమిళంలోనూ సత్తా చాటుతోంది. అక్కడ కూడా స్టార్ హీరోలందరితోనూ నటించే అవకాశాలను అందుకుంది. తద్వారా ఇప్పటికే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక, ఈ మధ్య కాలంలోనైతే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పిస్తోంది. తద్వారా రెండు భాషల్లోనూ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది.

చైతూతో లవ్ ట్రాక్... వివాహం తర్వాత

చైతూతో లవ్ ట్రాక్... వివాహం తర్వాత

సమంత.. నాగ చైతన్య కలిసి 'ఏమాయ చేశావే' సినిమా చేశారు. అప్పుడు ఆడిషన్స్ కోసం ఆమె ఫొటోను తొలిసారి చూశాడట. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. 'ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు. ఇలా చాలా కాలం లవ్ ట్రాక్ నడిపిన తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా కెరీర్‌ను సాగిస్తున్నారు.

అలా బుల్లితెరపై... ఇలా డిజిటల్ ఎంట్రీ

అలా బుల్లితెరపై... ఇలా డిజిటల్ ఎంట్రీ

వెండితెరపై తిరుగులేని హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఓ ఎపిసోడ్‌ను హోస్ట్ చేసింది. ఆ తర్వాత లాక్‌డౌన్ సమయంలో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం 'సామ్ జామ్' అనే షోతో రియల్ హోస్ట్ చేసింది సమంత. అదే సమయంలో 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి వెళ్తోంది.

ఇండియాలోనే ఫస్ట్ హీరోయిన్‌గా రికార్డు

ఇండియాలోనే ఫస్ట్ హీరోయిన్‌గా రికార్డు

కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' హవా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఇండియా ఈ సిరీస్‌ కోసం ఓ ఎమోజీని స్పెషల్‌గా విడుదల చేసింది. ఇందులో హీరో మనోజ్‌ భాజ్‌పేయ్‌తో పాటు సమంతను కూడా ఉంచారు. ఇలా ఇండియాలోని ఏ హీరోయిన్‌కు కూడా ఇప్పటి వరకు ఎమోజీ రాలేదు. దీంతో సమంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసకున్నట్లైంది.

అందులో తెలుగు హీరోలంతా ఆమె వెనకే

అందులో తెలుగు హీరోలంతా ఆమె వెనకే

సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఇక, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె 16.5 మిలియన్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇలా తెలుగులో ఏ హీరోకూ ఫాలోవర్లు లేకపోవడం విశేషం. ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ నెంబర్‌ వన్‌గా వెలిగిపోతోన్న సమంతకు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X