For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంతది 'అలాంటి' రోల్.. షాక్ అవ్వడం ఖాయం.. బయటపెట్టిన ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్స్!

  |

  తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది మళయాళ భామ సమంత. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత ఆయననే వివాహం చేసుకుని అక్కినేని ఇంటి కోడలైంది. చివరిగా జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ఇప్పుడు తెలుగులో ఒక సినిమా, తమిళ్ లో మరో సినిమా చేస్తోంది. ఇక అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానున్న 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌ పార్ట్ 2లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్‌లో స్ట్రీమ్ కానుంది. ఆమె పాత్ర గురించి కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే

  పెళ్లి తర్వాత టోటల్ చేంజ్

  పెళ్లి తర్వాత టోటల్ చేంజ్


  నాగచైతన్యను పెళ్లాడిన తర్వాత సమంత పూర్తిగా సినిమాలకు దూరం అయిపోతుంది అని అందరూ భావించారు.. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆమె సినిమాలు చేస్తోంది. కానీ ఇది వరకులా అన్ని సినిమాల్లో ఒప్పుకోకుండా పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఎంచుకుంటోంది. ఈ భామ ఫ్యామిలి మాన్ పార్ట్ 2తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. ఈ పాత్ర మీద సమంత అభిమానులు అలాగే అక్కినేని అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.

  నయనతార బాయ్ ఫ్రెండ్ తో

  నయనతార బాయ్ ఫ్రెండ్ తో

  ప్రస్తుతానికి సమంత విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఒక తమిళ సినిమా చేస్తోంది. నయనతార హీరోయిన్ గా విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత కూడా నటిస్తోంది. అయితే ఈ భామ ఆ తమిళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందో లేక ఏదయినా ప్రత్యేక పాత్రా ? అనేదాని మీద క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే ఆమె మరో తమిళ సినిమా ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు ఈ సినిమా పూర్తయ్యాక అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

  గుణశేఖర్ తో శాకుంతలం

  గుణశేఖర్ తో శాకుంతలం

  తమిళంలో ఎలా అయితే ఒక సినిమా చేస్తుందో తెలుగులో కూడా ఈ భామ ఒక సినిమా అనౌన్స్ చేసింది.. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా తెరకెక్కుతోంది. మహాభారతంలోని ఆది పర్వంకి సంబంధించిన దుష్యంతుడు శకుంతల ప్రేమకథను గుణశేఖర్ ఒక సినిమాగా తెరకెక్కిస్తున్నారు.. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో దుష్యంతునిగా నటిస్తున్నాడు.

  ముహూర్తం రెడీ

  ముహూర్తం రెడీ

  ఇక ఆ సంగతి పక్కన పెడితే మరి కొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ కాబోతున్న ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ కూడా లాక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. జూన్ 11వ తేదీన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

  ఆ సినిమాలో చూసి

  ఆ సినిమాలో చూసి

  అయితే ఈ వెబ్ సిరీస్ లో సమంత పాత్రకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె టెర్రరిస్ట్ పాత్రలో నటిస్తుందని ఒకసారి లేదు వేరే పాత్ర అని మరోసారి రకరకాల ప్రచారాలు జరుగుతుండడంతో తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకులు రాజ్ - డీకేలు క్లారిటీ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్ లో సమంత ఒక బోల్డ్ క్యారెక్టర్ చేసిందని వారు చెప్పుకొచ్చారు. ఈ క్యారెక్టర్ కోసం ఒక సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ కోసం చూస్తున్న సమయంలో అనుకోకుండా సూపర్ డీలక్స్ సినిమా చూశామని ఆ సినిమాలో ఆమె నటన నచ్చడంతో సమంతను సంప్రదించామని చెప్పుకొచ్చారు

  SSMB 28 : అక్కినేని హీరో వైపు చూస్తున్న Trivikram, నో చెప్పే ఛాన్సే లేదు || Filmibeat Telugu
   షాక్ అవ్వడం ఖాయం

  షాక్ అవ్వడం ఖాయం


  సమంతను కలిసి స్టోరీ వినిపించగా ముందు ఆమె ఎలాంటి కామెంట్స్ చేయలేదు కానీ తర్వాత ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు.. ఈ సినిమాలో మునుపెన్నడూ లేనంత బోల్డ్ గా సమంతను చూడబోతున్నామని వారు పేర్కొన్నారు. చూసి ఆడియన్స్ అందరు షాక్ అవ్వడం ఖాయం అని చెప్పుకొచ్చారు.. అయితే ఈ పాత్ర సంబంధించి ఇంతకుమించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఒక్కసారి చూస్తే ప్రేక్షకులకే ఆమె పాత్ర గురించి పూర్తి క్లారిటీ వస్తుందని వారు చెప్పుకొచ్చారు

  English summary
  Samantha Akkineni is making her web debut with The Famil Man Season 2. The makers are gearing up for premiere on June 11th, on Amazon Prime. Recently directors Raj and DK reveals that her performance will shock everyone. The director duo revealed that Samantha Akkineni's performance in the show will leave everyone in shock.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X