For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరోసారి పేరు మార్చుకున్న సమంత: పెళ్లి తర్వాత అలా ఇప్పుడు ఇలా.. అక్కినేని కోడలిపై అనుమానాలు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది అక్కినేని వారి కోడలు సమంత. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమై యాక్టింగ్‌తో అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంది. ఈ మధ్యనే డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. అక్కడా దుమ్ము దులిపేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత తన పేరును మార్చుకుని అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఆమె ఎందుకిలా చేసింది? అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  అక్కడా ఇక్కడా సత్తా చాటిన సమంత

  అక్కడా ఇక్కడా సత్తా చాటిన సమంత

  ఎంతో కాలంగా వరుస విజయాలను అందుకుంటూ సమంత దూసుకుపోతోంది. టాలీవుడ్‌లోనే కాదు.. కోలీవుడ్‌లోనూ ఆమె హిట్ల మీద హిట్లు తన ఖాతాలో వేసుకుంటోంది. ఫలితంగా రెండు భాషల్లోనూ ఎనలేని క్రేజ్‌ను పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె చేసిన ‘జాను' విజయాలకు బ్రేక్ వేసింది. దీని తర్వాత ఈ స్టార్ హీరోయిన్ సినిమాల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది.

  విడాకుల తర్వాత జీవితం ఇలా: ఆసక్తికర ఫొటో వదిలిన సుమంత్.. ‘మళ్లీ మొదలైంది' అంటూ!

  అందులో కూడా అడుగు పెట్టిన బ్యూటీ

  అందులో కూడా అడుగు పెట్టిన బ్యూటీ

  సుదీర్ఘ కాలంగా వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా తన హవాను చూపించిన సమంత.. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటించింది. దీనికంటే ముందే ఆహా సంస్థ కోసం ‘సామ్ జామ్' షోను హోస్టు చేసి ఆకట్టుకుందీ బ్యూటీ.

  దేశ వ్యాప్తంగా గుర్తింపు.. రాజీ క్రేజీగానే

  దేశ వ్యాప్తంగా గుర్తింపు.. రాజీ క్రేజీగానే

  ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ.. అక్కినేని సమంత పాత్రే ఎంతో హైలైట్ అయింది. ఇందులో ఆమె చేసిన రాజీ అనే రోల్‌కు ఎంతగానో పేరు వచ్చింది. తొలిసారి బోల్డుగా, నెగెటివ్ షేడ్స్‌తో చేసినప్పటికీ సమంత అద్భుతంగా నటించింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా పెంచేసుకుందామె.

  ‘శాకుంతల'గా మారిన అక్కినేని కోడలు

  ‘శాకుంతల'గా మారిన అక్కినేని కోడలు


  ప్రస్తుతం సమంత ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. అదే గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం'. ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు హీరోగా నటిస్తున్నాడు. అలాగే, అల్లు అర్జున్ గారాల పట్టీ అర్హ కూడా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ


  చేతి నిండా ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అక్కినేని సమంత సోషల్ మీడియాలో కూడా చాలా కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే సమంతను ఫాలో అయ్యే వారి సంఖ్య తెలుగులో ఏ హీరోకూ లేనంతగా ఉండడం విశేషం.

  ప్రియుడితో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: ఏకంగా అతడి మీదకు ఎక్కేసి.. అది మాత్రమే చూడండి అంటూ!

  పేరు మార్చుకున్న హీరోయిన్ సమంత

  పేరు మార్చుకున్న హీరోయిన్ సమంత

  సోషల్ మీడియాలో బిజీ బిజీగా గడిపే అక్కినేని వారి కోడలు సమంత తాజాగా తన పేరును మార్చుకుంది. అయితే, అది రియల్ లైఫ్‌లో కాదు.. సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మాత్రమే. ఇప్పటి వరకూ Samantha Akkineni అని పేరు పెట్టుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం కేవలం ‘S' అని మార్చుకుంది. దీంతో ఈ అమ్మడు పేరు హాట్ టాపిక్ అయిపోతుంది.

  Allu Arjun Got 4.3 Billion views on Tik Tok, King of Social Media
  పెళ్లి తర్వాత అలా.. ఇప్పుడు షాకింగ్‌గా

  పెళ్లి తర్వాత అలా.. ఇప్పుడు షాకింగ్‌గా

  హీరోయిన్‌గా కొనసాగే సమయంలో సమంత సోషల్ మీడియాలో samantharuthprabhuoffl అని పేరు పెట్టుకుంది. అయితే, నాగ చైతన్యతో వివాహం అయిన తర్వాత Samantha Akkineni అని మార్చుకుంది. ఇక, ఇప్పుడేమో ‘S' అని మార్చుకుంది. దీంతో సమంతకు అసలేమై ఉంటుందా అని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడిది చర్చనీయాంశం అవుతోంది.

  English summary
  Tollywood Star Heroine Samantha Akkineni Now Doing Shakuntalam Movie. Now She Changed her Name in Twitter and Instagram. This Created Many Doubts.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X