మరింత బోల్డ్‌గా సమంత.. లేటేస్ట్ ఫోటో‌షూట్‌ వైరల్: తొలిసారి అలా కనిపించడంతో!

తొలి చిత్రం 'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసి.. అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది టాలెంటెడ్ హీరోయిన్ సమంత. ఆ వెంటనే భారీ సినిమాల్లో ఆఫర్లు అందుకుని సత్తా చాటింది. దీంతో కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తన హవాను చూపిస్తూనే ఉంది. ఇక, సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. తరచూ తన అందాలతో కవ్విస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా టాప్ విప్పేసిన ఫొటోను షేర్ చేసి అందరికి షాకిచ్చింది. ఆ వివరాలు మీకోసం!

 రెండింట్లోనూ ఫామ్.. అలా బ్రేక్ పడింది

రెండింట్లోనూ ఫామ్.. అలా బ్రేక్ పడింది

దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది సమంత. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆమె.. ఈ మధ్య కాలంలో వరుస హిట్లను అందుకుంటూ సత్తా చాటింది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలోనూ సక్సెస్ అవుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో గత ఏడాది విడుదలైన 'జాను' ఆమె విజయాలకు బ్రేక్ వేసింది.

 కొత్త ప్రపంచంలోకి.. క్లారిటీ రావడంలేదు

కొత్త ప్రపంచంలోకి.. క్లారిటీ రావడంలేదు

ఇంత కాలం పాటు హీరోయిన్‌గా వెండితెరపై తన హవాను చూపించిన సమంత.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటిస్తోంది. మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్‌ విడుదలపై క్లారిటీ లేదు.

లాక్‌డౌన్‌లోనూ బిజీగా.. సంపాదించింది

లాక్‌డౌన్‌లోనూ బిజీగా.. సంపాదించింది

లాక్‌డౌన్ సమయంలో సినిమాలు లేకపోవడంతో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం 'సామ్ జామ్' అనే షోతో రియల్ హోస్ట్ చేసింది సమంత. సినీ సెలెబ్రిటీలతో చిట్ చాట్ చేసే ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఇందులో తనదైన శైలి హోస్టింగ్‌తో ఆకట్టుకోన్న ఆమె.. అల్లరి చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ తెగ సందడి చేసింది. అదే సమయంలో ఈ షో ద్వారా రూ. రూ. 1.50 కోట్లు అందుకుందట.

 పాన్ ఇండియా మూవీలో భాగమైందిగా

పాన్ ఇండియా మూవీలో భాగమైందిగా

'జాను' తర్వాత సమంత సినిమాలు చేయదన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం పాటు తెలుగులో మరో ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నట్లు వెల్లడించింది. ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు.

 ఎప్పుడూ అందులోనే.. రికార్డు స్థాయిలో

ఎప్పుడూ అందులోనే.. రికార్డు స్థాయిలో

అక్కినేని సమంత సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే ఆమెకు తెలుగులో ఏ హీరోకూ లేనంత మంది ఫాలోవర్లు ఉండడం విశేషం.

టాప్ విప్పేసి సెగలు రేపుతోన్న సమంత

టాప్ విప్పేసి సెగలు రేపుతోన్న సమంత

సమంత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తరచూ ఏదో ఒక రకమైన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ హాట్ షో కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేసింది. అందులో సామ్ తన డ్రెస్‌ను ఒకవైపు జారవిడిచింది. అలాగే, తొడల వరకూ కనిపించేలా ఫోజులిచ్చింది. క్లీవేజ్‌ షోతోనూ మంట పెడుతోంది.

 వాళ్లు కూడా కామెంట్స్.. ఫ్యాన్స్ షాక్‌లో

వాళ్లు కూడా కామెంట్స్.. ఫ్యాన్స్ షాక్‌లో

అక్కినేని సమంత షేర్ చేసిన ఈ హాట్ ఫొటోకు సామాన్యుల నుంచే కాదు.. సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, హన్సిక, యాంకర్ విష్ణు ప్రియ, సింగర్ చిన్మయి సహా ఎంతో మంది ప్రముఖులు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ మాత్రం మిశ్రమంగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recommended Video

Akkineni Nagarjuna Says SS Thaman Is A Star

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X