For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత ఏంటి ఇలా పెంచేసింది? ఫిగర్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

  |
  Samantha Akkineni Hikes Her Remuneration After Oh Baby Success || Filmibeat Telugu

  వరుస విజయాలతో దూకుడు మీదుంది అక్కినేని వారి కోడలు సమంత. పెళ్లికి ముందు ఎన్నో ఫ్లాపులను చూసిన ఆమె.. ఆ తర్వాత మాత్రం అస్సలు ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం'లో అద్భుతమైన నటన కనబరిచిన ఆమె.. ఆ తర్వాత 'మహానటి', 'యూటర్న్'లో మంచి మార్కులు కొట్టేసింది. ఇక, ఇటీవల విడుదలైన 'ఓ బేబి'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుస హిట్‌లను సొంతం చేసుకుంటున్న సమంత.. ఫిల్మ్ మేకర్స్‌కు షాకిస్తుందట.

  ‘ఓ బేబి'తో మిలియన్ డాలర్ క్లబ్

  ‘ఓ బేబి'తో మిలియన్ డాలర్ క్లబ్

  ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన ‘ఓ బేబి' ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ'కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలోనే భారీ వసూళ్లను రాబట్టింది. ఇక్కడే కాదు.. ఓవర్సీస్‌లోనూ సత్తా చాటింది. అక్కడ మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిందీ సినిమా.

  సమంత రికార్డు

  సమంత రికార్డు

  గతంలో అనుష్క ప్రాధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం ‘రుద్రమ దేవి'. ఇందులో అల్లు అర్జున్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఓవర్సీస్‌లో 970 డాలర్లను సంపాదించింది. ఈ రికార్డును సమంత ‘ఓ బేబి' క్రాస్ చేసింది. అంతేకాదు, మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిపోయింది. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఇలా మిలియన్ సాధించడం రికార్డు.

  భారీగా పెంచేసింది

  భారీగా పెంచేసింది

  వరుస హిట్లు వస్తుండడంతో సమంత తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందని ఫిలింనగర్‌లో ప్రస్తుతం ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. తనకున్న క్రేజ్.. హిట్ ట్రాక్‌ను ప్రస్తావిస్తూ ఆమె ఫిల్మ్ మేకర్స్ వద్ద రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని వార్తలు వస్తున్నారు. ఇప్పటి వరకు సమంత ఒక్కో సినిమాకు రూ. 2 కోట్లు తీసుకునేదని సమాచారం.

  ఫిగర్ చూసి షాక్ అవుతున్నారు

  ఫిగర్ చూసి షాక్ అవుతున్నారు

  తన తాజా చిత్రం ‘ఓ బేబి' వరకు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసిన సమంత.. ఇకపై నటించే వాటికి మాత్రం రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. ఈ ఫిగర్ చూసి ఫిల్మ్ మేకర్లు నోరెళ్లబెడుతున్నారని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు. క్రేజ్ ఉన్న సమంత తమ సినిమాలో కావాలంటే అంత మొత్తం ఇవ్వడానికి వాళ్లు వెనుకాడడం లేదని టాక్.

   ఫ్యూచర్ ఫ్రాజెక్ట్స్

  ఫ్యూచర్ ఫ్రాజెక్ట్స్

  ప్రస్తుతం నటిస్తున్న ‘96’ రీమేక్ తప్ప, సమంత ఇప్పటి వరకు ఏ సినిమాకూ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే, ఆమె నందినీ రెడ్డితో మరోసారి నటించబోతుందని అంటున్నారు. అలాగే, వెబ్ సిరీస్‌లో నటించడానికి కూడా సంతకం చేసేసిందని ప్రచారం జరుగుతోంది. అలాగే, నిర్మాతగా మారి భర్తతో కలిసి సినిమాలు తీసే ఆలోచనలోనూ ఉందని వార్తలు వస్తున్నాయి.

  ‘ఓ బేబి' గురించి

  ‘ఓ బేబి' గురించి

  నందినీ రెడ్డి దర్శకత్వంలో స‌మంత అక్కినేని నటించిన చిత్రం ‘ఓ బేబీ'లో ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్‌లు తెరకెక్కించారు. ‘మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రానికి ఇది రీమేక్. దీనిని బాలీవుడ్‌లోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.

  English summary
  Samantha akkineni New Movie Oh Baby. This Film Directed By B. V. Nandini Reddy. Oh Baby Remake Of miss granny. This Film Running Successfully. This movie Breaks Her previous Records. Then samantha remuneration was hike.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X