Don't Miss!
- News ఓటర్లను బెదిరించిన డీకేపై ఎఫ్ఐఆర్, అయ్యా అలా అనలేదని హైకోర్టులో పిటిషన్, అపార్ట్ మెంట్ లో ?
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆశ్చర్యపోయిన సమంత.. ఈ ఫొటోలు మీకెలా దొరికాయంటూ!
Recommended Video
సోషల్ మీడియా బాగా విస్తరించడంతో అభిమానులు, సెలబ్రిటీల మధ్య దూరం చాలా తగ్గింది. ఈ మేరకు నెటిజన్లు తమ తమ అభిమాన నటీనటులతో చాట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనటం, వారిని సర్ప్రైజ్ చేసే సదుపాయం వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొందరు నెటిజన్లు సమంతనే ఆశ్చర్యపరిచే కొన్ని ఫొటోలు ఆమెకు ట్యాగ్ చేశారు. దీంతో సర్ప్రైజ్ అయిన సామ్.. ఎలా రియాక్ట్ అయిందంటే..
|
అప్పుడు ఆమె ఎత్తుకుంటే.. ఇప్పుడు ఈమె
'ప్రేమ అనేది ఏనాటికీ తరిగి పోనిది. ఆ రోజు సమంతను వాళ్ళ అమ్మ భుజాల మీద ఎత్తుకుంటే.. ఈ రోజు సమంత, వాళ్ళ అమ్మ భుజాలను ఆప్యాయంగా హత్తుకుంటోంది' అని పేర్కొంటూ సామ్ చిన్నప్పటి ఫొటోతో లేటెస్ట్ ఫొటోను పోల్చుతూ ఓ నెటిజన్ సమంతకు ట్వీట్ చేశాడు. ఇది చూసిన సామ్.. ఆశ్చర్యపోయి ఈ ఫొటో మీకెక్కడిని అని ప్రశ్నిస్తూ లవ్ ఎమోజీలు పోస్ట్ చేసింది.
|
అప్పట్లో భర్త నాగ చైతన్య, అఖిల్‌తో కలిసి సామ్
ఇక చాలా ఎల్లా క్రిందట భర్త నాగ చైతన్య, అఖిల్‌తో కలిసి సామ్ దిగిన రారే పిక్ షేర్ చేశాడు మరో నెటిజన్. దీనిపై ఆమె స్పందిస్తూ ఆ రోజు మేం ఏం మాట్లాడుకున్నామో ఇప్పటికీ గుర్తుంది అని పేర్కొంది. అభిమానులు షేర్ చేసిన ఈ పిక్స్ సమంతను ఆశ్చర్యపరచడమే గాక ఆనంద పర్చాయి.
ఓ బేబీ సమంత
ఈ ఏడాది వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్న సమంత.. ఇటీవలే ఓ బేబీ రూపంలో మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 63 ఏళ్ల ముసలావిడ లక్షణాలతో 23 ఏళ్ల పడుచు పిల్లగా సమంత ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.
సమంత అప్‌కమింగ్ ప్రాజెక్టులు
ప్రస్తుతం సమంత.. మామ నాగార్జున హీరోగా నటిస్తోన్న 'మన్మథుడు 2' చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. '96' రీమేక్ లోనూ నటిస్తోంది. దీంతో పాటు సమంత, నందినీరెడ్డి కలిసి ఓ బేబీ సీక్వల్ తీస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి గత కొన్నేళ్లుగా అక్కినేని కోడలు సమంత దూకుడు మాములుగా లేదనే చెప్పుకోవాలి. స్టార్ హీరోల రేంజ్ ఫాలోయింగ్ కొట్టేసింది సమంత.