twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆశ్చర్యపోయిన సమంత.. ఈ ఫొటోలు మీకెలా దొరికాయంటూ!

    |

    Recommended Video

    Fan Surprises Samantha Akkineni By Posting Sam's Rare Pictures || Filmibeat Telugu

    సోషల్ మీడియా బాగా విస్తరించడంతో అభిమానులు, సెలబ్రిటీల మధ్య దూరం చాలా తగ్గింది. ఈ మేరకు నెటిజన్లు తమ తమ అభిమాన నటీనటులతో చాట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనటం, వారిని సర్‌ప్రైజ్ చేసే సదుపాయం వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొందరు నెటిజన్లు సమంతనే ఆశ్చర్యపరిచే కొన్ని ఫొటోలు ఆమెకు ట్యాగ్ చేశారు. దీంతో సర్‌ప్రైజ్ అయిన సామ్.. ఎలా రియాక్ట్ అయిందంటే..

    అప్పుడు ఆమె ఎత్తుకుంటే.. ఇప్పుడు ఈమె

    'ప్రేమ అనేది ఏనాటికీ తరిగి పోనిది. ఆ రోజు సమంతను వాళ్ళ అమ్మ భుజాల మీద ఎత్తుకుంటే.. ఈ రోజు సమంత, వాళ్ళ అమ్మ భుజాలను ఆప్యాయంగా హత్తుకుంటోంది' అని పేర్కొంటూ సామ్ చిన్నప్పటి ఫొటోతో లేటెస్ట్ ఫొటోను పోల్చుతూ ఓ నెటిజన్ సమంతకు ట్వీట్ చేశాడు. ఇది చూసిన సామ్.. ఆశ్చర్యపోయి ఈ ఫొటో మీకెక్కడిని అని ప్రశ్నిస్తూ లవ్ ఎమోజీలు పోస్ట్ చేసింది.

    అప్పట్లో భర్త నాగ చైతన్య, అఖిల్‌తో కలిసి సామ్

    ఇక చాలా ఎల్లా క్రిందట భర్త నాగ చైతన్య, అఖిల్‌తో కలిసి సామ్ దిగిన రారే పిక్ షేర్ చేశాడు మరో నెటిజన్. దీనిపై ఆమె స్పందిస్తూ ఆ రోజు మేం ఏం మాట్లాడుకున్నామో ఇప్పటికీ గుర్తుంది అని పేర్కొంది. అభిమానులు షేర్ చేసిన ఈ పిక్స్ సమంతను ఆశ్చర్యపరచడమే గాక ఆనంద పర్చాయి.

    ఓ బేబీ సమంత

    ఓ బేబీ సమంత

    ఈ ఏడాది వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్న సమంత.. ఇటీవలే ఓ బేబీ రూపంలో మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 63 ఏళ్ల ముసలావిడ లక్షణాలతో 23 ఏళ్ల పడుచు పిల్లగా సమంత ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.

    సమంత అప్‌కమింగ్ ప్రాజెక్టులు

    సమంత అప్‌కమింగ్ ప్రాజెక్టులు

    ప్రస్తుతం సమంత.. మామ నాగార్జున హీరోగా నటిస్తోన్న 'మన్మథుడు 2' చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. '96' రీమేక్ లోనూ నటిస్తోంది. దీంతో పాటు సమంత, నందినీరెడ్డి కలిసి ఓ బేబీ సీక్వల్ తీస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి గత కొన్నేళ్లుగా అక్కినేని కోడలు సమంత దూకుడు మాములుగా లేదనే చెప్పుకోవాలి. స్టార్ హీరోల రేంజ్ ఫాలోయింగ్ కొట్టేసింది సమంత.

    English summary
    Samantha Akkineni's latest movie Oh Baby which is directed by B. V. Nandini Reddy. This movie got huge response from the family audience. Now Samantha Akkineni Get Surprised with Social media photo which is posted by a netijan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X