For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గ్లామర్ షోతో మాయ చేసిన సమంత: తొలిసారి ఓ రేంజ్‌లో అందాల విందు.. ఈ ఫొటోతో రికార్డు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా తన హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది అక్కినేని వారి కోడలు సమంత. అందంలోనే కాదు.. నటనలోనూ ప్రేక్షకులను ఫిదా చేస్తూ అలరిస్తోన్న బ్యూటీ.. కెరీర్ ఆరంభం నుంచే ఎన్నో విజయాలను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇక, ఈ మధ్య సినిమాల వేగం తగ్గించినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండడం ద్వారా ఫ్యాన్స్‌ను నిత్యం టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత అదిరిపోయే అందాల విందు చేస్తూ ఓ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఆ పిక్‌పై మీరూ ఓ లుక్ వేయండి!

  వరుస హిట్లతో సత్తా.. అలా బ్రేక్ పడింది

  వరుస హిట్లతో సత్తా.. అలా బ్రేక్ పడింది

  కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది సమంత. టాలీవుడ్‌లోనే కాదు.. కోలీవుడ్‌లోనూ ఆమె హిట్ల మీద హిట్లు తన ఖాతాలో వేసుకుంటోంది. ఫలితంగా రెండు భాషల్లోనూ ఎనలేని క్రేజ్‌ను పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె చేసిన ‘జాను' విజయాలకు బ్రేక్ వేసింది. దీని తర్వాత ఈ స్టార్ హీరోయిన్ సినిమాల వేగాన్ని బాగా తగ్గించేసిందనే చెప్పాలి.

  డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టిన సామ్

  డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టిన సామ్

  దాదాపు పదేళ్లుగా వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా తన హవాను చూపించిన సమంత.. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటించింది. ఇక, ఈ వెబ్ సిరీస్‌లో సామ్ కనిపించిన తీరు, చేసిన పాత్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

  ఆమె పాత్రే హైలైట్... దేశ వ్యాప్తంగా క్రేజ్

  ఆమె పాత్రే హైలైట్... దేశ వ్యాప్తంగా క్రేజ్

  ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ.. అక్కినేని సమంత పాత్రే ఎంతో హైలైట్ అయింది. ఇందులో ఆమె చేసిన రాజీ అనే రోల్‌కు ఎంతగానో పేరు వచ్చింది. తొలిసారి బోల్డుగా, నెగెటివ్ షేడ్స్‌తో చేసినప్పటికీ సమంత అద్భుతంగా నటించింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఫలితంగా క్రేజ్‌ను మరింతగా పెంచుకుందామె.

  పాన్ ఇండియా మూవీలో భాగమైందిగా

  పాన్ ఇండియా మూవీలో భాగమైందిగా

  ఈ మధ్య కాలంలో సమంత పెద్దగా ప్రాజెక్టులను ప్రకటించడం లేదు. దీంతో ఆమె సినిమాలకు దూరమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో గుణశేఖర్‌ దర్శకత్వంలో ఈ బ్యూటీ ‘శాకుంతలం' అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నట్లు వెల్లడించింది. ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అక్కినేని సమంత సోషల్ మీడియాలో కూడా చాలా కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే అక్కినేని కోడలిని ఫాలో అయ్యే వారి సంఖ్య తెలుగులో ఏ హీరోకూ లేనంతగా ఉంది.

  Actor / Assistant Director Swapnika Exclusive Interview Part 2
  గ్లామర్ షోతో మాయ చేసిన స్టార్ బ్యూటీ

  గ్లామర్ షోతో మాయ చేసిన స్టార్ బ్యూటీ

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో వైట్ డ్రెస్‌ను వేసుకున్న ఆమె బ్యాక్‌లెస్‌గా కనిపిస్తోంది. అదే సమయంలో ఆమె ఎద అందాలు సైతం నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు రికార్డు స్థాయిలో 2 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. దీంతో ఇది వైరల్ అయిపోతోంది.

  English summary
  Samantha Akkineni Very Active in Social Media. Now She Shared Backless Glamourous Photo in her Instagram. This pic Gone Viral in Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X