మరో ఫీట్‌ను అందుకున్న సమంత.. అందులో అక్కినేని కోడలి హవా!
సమంత సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. తెరపై కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంటుంది. ఇంట్లో నాగ చైతన్య కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటుంది. ఈ విషయంలో నాగా చైతన్య కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకు అంత యాక్టివ్‌గా ఉంటావని నేరుగా సమంతనే అడిగేశాడు. తన ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో అభిమానులకు చూపెట్టాలని అందుకే యాక్టివ్‌గా ఉంటానని సమంత చెప్పుకొచ్చింది.
సమంత అంత సరదాగా ఉంటుంది కాబట్టే అంతటి ఫాలోయింగ్, క్రేజ్ ఉంటుంది. సమంతకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల గణనీయంగా పెరుగుతూ ఉంటారు. గతేడాది నుంచి ఆ పెరుగుదల ఓ రేంజ్‌లో ఉంటోంది. లాక్డౌన్ సమయంలో సమంతకు పుట్టలుపుట్టలుగా ఫాలోవర్లు వచ్చి పడ్డారు. 10, 11, 12 మిలియిన్లు ఇలా లెక్కపెట్టుకుంటూ పోయింది సమంత. నెలకు ఒక మిలియన్ చొప్పున పెరుగుతూ వచ్చారు.

చివరకు సమంత ఇప్పుడు మరో ఫీట్‌ను అందుకుంది. తాజాగా తన ఇన్ స్టా ఫాలోవర్ల సంఖ్య 16 మిలియన్లకు చేరుకుంది. ఈక్రమంలో సమంత గాల్లో తేలిపోయింది. ఈ మేరకు తన ఫ్యామిలీ సంఖ్య 16 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో బిజీగా ఉంది. ఆ మధ్య సినిమాను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక సమంత ఫ్యామిలీమెన్ సీజన్ 2 రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications











