For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టిన సమంత: ప్రముఖ బ్యానర్‌లో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్!

  |

  'ఏమాయ చేశావే' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా పరిచయం అయింది గ్లామర్ భామ సమంత. ఆరంభంలోనే తన అందంతో పాటు నటనతో మంచి మార్కులు కొట్టేసిన ఈమె.. వరుసగా అవకాశాలను అందుకుంటూ వచ్చింది. ఫలితంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అదే సమయంలో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సైతం అందుకుంది. ఇలా చాలా కాలంగా హవాను చూపిస్తూ వస్తోందామె. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజులుగా సమంత గురించి పలు రకాల వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత గురించి ఓ సీక్రెట్ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

  అక్కడా ఇక్కడా హవాను చూపిస్తూ

  అక్కడా ఇక్కడా హవాను చూపిస్తూ

  టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది సమంత. ఈ క్రమంలోనే చేతి నిండా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపింది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ వరుస చిత్రాల్లో సత్తా చాటింది. ఇలా ఇక్కడా అక్కడ ఎన్నో విజయాలను అందుకుంది. ఫలితంగా రెండు చోట్లా స్టార్‌గా వెలుగొందుతూ హవాను చూపిస్తోందీ బ్యూటీ.

  Maestro Full Movie: నితిన్‌కు బిగ్ షాక్.. రిలీజ్ అయిన గంటల్లోనే లీక్.. ఆ సైట్‌లో డౌన్‌లోడ్ లింక్

  ఓటీటీలోకి ఎంట్రీ... గ్రాండ్ సక్సెస్

  ఓటీటీలోకి ఎంట్రీ... గ్రాండ్ సక్సెస్

  ఇంత కాలం వెండితెరపై సందడి చేసిన సమంత‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి నటించినా.. సమంత పాత్రే ఎంతో హైలైట్ అయింది. తొలిసారి బోల్డుగా, నెగెటివ్ షేడ్స్‌తో అద్భుతంగా నటించింది. దీంతో ఆమెకు‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' అవార్డు కూడా సొంతం అయింది.

  పాన్ ఇండియా మూవీ చేసిన సామ్

  పాన్ ఇండియా మూవీ చేసిన సామ్

  ఈ మధ్య కాలంలో స్పీడు తగ్గించిన సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం' అనే పాన్ ఇండియా ఫిల్మ్‌లో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు హీరోగా నటిస్తుండగా.. అల్లు అర్హ కూడా చేస్తోంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

  Bigg Boss: రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఆమె మాత్రం పైపైకి!

  వ్యక్తిగత విషయంతో వార్తల్లో నిలిచి

  వ్యక్తిగత విషయంతో వార్తల్లో నిలిచి

  సమంత.. అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ల పెళ్లై చాలా కాలం అవుతోంది. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగిందని ఇటీవల ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి కారణం సామ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో అక్కినేని పేరు తీసేయడమే. అప్పటి నుంచి వీళ్ల గురించి తరచూ ఏదో ఒక వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూ ఉంది.

  సినిమాలకు దూరమైపోయిన భామ

  సినిమాలకు దూరమైపోయిన భామ

  గతంలో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన సమంత.. అప్పటి మాదిరిగా కొంత కాలంగా వరుస పెట్టి సినిమాలు చేయడం లేదు. ఇక, ‘శాకుంతలం' తర్వాత ఆమె సినిమాలకు దూరం అయిపోతుందని కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అదే సయమంలో ప్రెగ్నెంట్ అవబోతుందని కూడా జోరుగా ప్రచారం జరిగింది.

  తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్: ఆమె ప్రెగ్నెంట్ అనడానికి ఇదే సాక్ష్యం.. అలా కనిపించడంతో!

  పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టిన సమంత

  పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టిన సమంత

  పలు పుకార్ల వల్ల సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక, సినిమాలకు దూరం అవుతోందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో తాజాగా ఆమె గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సమంత ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీన్ని నూతన దర్శకుడు తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది.

  Shakalaka Shankar Corporator Movie Official Trailer Released | Filmibeat Telugu
  ఆయన ఎంట్రీతో మార్చుకుందట

  ఆయన ఎంట్రీతో మార్చుకుందట

  ‘ఆదిత్య 369', ‘జెంటిల్‌మెన్', ‘సమ్మోహనం' వంటి చిత్రాలను నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ తన శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నారట. దీనికోసం ఆయన సమంతను ఒప్పించారని తెలుస్తోంది. ఇప్పటికే నూతన దర్శకుడు అదిరిపోయే కథను సామ్‌కు చెప్పాడని తెలిసింది. ఇందులో ఆమె విభిన్నమైన పాత్రను చేస్తుందని టాక్.

  English summary
  Samantha Has Decreased her Movies Past 3, 4 Years. Now She Gave Green Signal to New Director Under Sivalenka Krishna Prasad Production.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X